అండర్ వేర్ లను రోజూ మార్చకపోతే ఏమౌతుందో తెలుసా?
ఏ కాలమైనా సరే పరిశుభ్రత తప్పనిసరి. అయితే అండర్ వేర్ లను రోజూ మార్చాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇదెన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
నోటి పరిశుభ్రతను పాటించడానికి ప్రతిరోజూ దంతాలను బ్రష్ చేయాలన్న సంగతి అందరికీ తెలుసు. అయితే ఆరోగ్యంగా ఉండటం కోసం ప్రతిరోజూ లోదుస్తులను మార్చడం కూడా అంతే అవసరం. అండర్ వేర్ లను మార్చకపోతే ఎన్నో ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. వరుసగా రెండు రోజులు కూడా అదే అండర్ వేర్ ను వేసుకోవడం ప్రమాకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నాయి. అయితే చాలా మంచి వార్షాకాలం, చలికాలంలో రోజూ స్నానం చేయడానికి ఇష్టపడరు. దీనివల్ల మరింత చలి పెడుతుందని. కానీ మీరు స్నానం రోజూ చేయకపోయినా.. అండర్ వేర్ లను ఖచ్చితంగా మార్చాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
2,000 మంది అమెరికన్లపై జరిపిన ఒక సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 45% మంది రెండు రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఒకే అండర్ వేర్ నుధరించారని కనుగొన్నారు. కానీ ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది మీ ఆరోగ్యాన్ని ఎన్నో విధాలుగా దెబ్బతీస్తుంది. అసలు రోజూ అండర్ వేర్ ను మార్చకపోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలొస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
యోని నుంచి దుర్వాసన రావొచ్చు
అండర్ వేర్ లపై రోజంతా ఉత్సర్గ, తేమ పెరగడం వల్ల బ్యాక్టీరియా, ఈస్ట్ లు, ఫంగస్ లు ఇక్కడ బాగా పెరిగిపోతాయి. అంతేకాదు ఇవి మలం, మూత్రంతో కలుషితమవుతాయి. ఇవి పేరుకుపోవడం వల్ల అండర్ వేర్ నుంచి చెడు వాసన వస్తుంది. ఇది మీకు ఇబ్బందికరంగా ఉండటమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది.
ప్రైవేట్ భాగంలో మొటిమలు
చెమట, తేమ, ధూళి, నూనె పేరుకుపోవడం వల్ల అక్కడ బాగా నొప్పిని కలిగించే ఎర్ర మొటిమలు అవుతాయి. ఈ మొటిమలు రావొద్దంటే మీ ముఖం మాదిరిగానే మీ సన్నిహిత ప్రాంతాన్ని కూడా తాజాగా, శుభ్రంగా ఉంచాలి.
ఈస్ట్ సంక్రమణకు సంతానోత్పత్తి కేంద్రంగా మారుతుంది
ఈస్ట్ ఇన్ఫెక్షన్ మహిళల్లో సర్వసాధారణమైన ఇన్ఫెక్షన్లలో ఒకటి. ఇది చెడు అలవాట్ల వల్లే వస్తుంది. ఇలాంటి ఇన్ఫెక్షన్లు సాధారణంగా మురికిగా ఉండే ఒకే అండర్ వేర్ ను ఎక్కువ రోజులు వేసుకోవడం వల్ల వ్యాప్తిస్తాయి. ఇది మీ సన్నిహిత ప్రాంతంలో, చుట్టుపక్కల చికాకు, అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
దద్దుర్లు
యోని దగ్గర దద్దుర్లు ఇబ్బందికరంగా ఉంటాయి. ఇలా కావడానికి ఇన్నర్లను మార్చకపోవడం కూడా ఒక కారణమేనంటున్నారు నిపుణులు. ప్రతిరోజూ అండర్ వేర్ ను మార్చకపోవడం వల్ల మీ చర్మం ఎర్రబడుతుంది. చికాకు కలుగుతుంది. తేమ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా యోని భాగం సున్నితంగా మారుతుంది. ఇది దద్దుర్లుకు దారితీస్తుంది. అందుకే అండర్ వేర్ లను రోజూ మార్చండి.
అండర్ వేర్ లను ఎప్పుడెప్పుడు మార్చాలి?
మీరు జిమ్ కు వెళ్లినప్పుడు అక్కడ చెమట ఎక్కువగా పడితే మీరు అండర్ వేర్ లను ఖచ్చితంగా మార్చాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పీరియడ్స్ సమయంలో కూడా లోదుస్తులను రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు మార్చాలి.