MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Health
  • గుడిలో కర్పూరాన్ని వెలిగించకూడదు.. ఎందుకో తెలుసా?

గుడిలో కర్పూరాన్ని వెలిగించకూడదు.. ఎందుకో తెలుసా?

గుడిలో.. ముఖ్యంగా గర్భ గుడిలో నూనె లేదా నెయ్యి దీపాలనే వెలిగిస్తారు. కానీ కర్పూరాన్ని మాత్రం వెలిగించరు. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా..?  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jul 21 2024, 10:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఉప్పుకప్పురంబు నొక్క పోలికనుండు... ఈ పద్యం నేర్చుకోని వారు ఎవరూ ఉండరు. ఉప్పు, కర్పూరం ఎలా అయితే ఒకటి కావో....  కర్పూరాలన్నీ కూడా ఒకటి కావు. అంటే మీకు తెలిసిన కర్పూరాలన్నీ మంచివి కావు.  ముఖ్యంగా ఆలయాల్లో వెలిగించే కర్పూరం నుంచి నల్లని పొగతో పాటు, ధూళి వెలువడుతుందన్న ముచ్చట మీకు తెలుసా? కర్పూరం నుంచి వచ్చే పొగను బాగా గమనిస్తే దీనిలో నల్లటి రేణువులు కనిపిస్తాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

కర్పూరం చెట్టు....

కర్పూరం కాంఫర్ లారెల్ అనే చెట్టు నుంచి ఉత్పత్తి అవుతుంది. ఈ చెట్టు ఆకులు, కొమ్మలు, బెరడు నుంచి కర్పూరాన్ని తయారుచేస్తారు. కర్పూరం చెట్టు సుమారుగా 100 అడుగుల వరకు పెరుగుతుంది. ఈ చెట్లు  ఎక్కువగా చైనా,  జపాన్ దేశాల్లో పెరుగుతాయి. ఇక మన దేశంలో అయితే ఈ చెట్లు మైసూరు ప్రాంతం, మలబార్,నీలగిరి కొండల్లో కనిపిస్తాయి. కర్పూరం సుమారుగా 20 రకాలుగా ఉంటుంది.  వీటిల్లో పచ్చ కర్పూరం చాలా ఫేమస్. వంటల్లో, ఆయుర్వేద మందుల తయారీలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ పచ్చ కర్పూరాన్ని చెట్టు వేర్లు కాండం ఉపయోగించి సేంద్రీయ విధానాల్లో తయారు చేస్తారు.
 

34
camphor

camphor

అయితే గుళ్లో ఇచ్చే హారతే మనకు ప్రమాదకరం. కానీ మిగిలిన అన్ని కర్పూరాలు మంచివే. ఎందుకంటే వీటిని సేంద్రీయ విధానాల్లో తయారు చేస్తారు.  ఒక్క గుడిలో వెలిగించే హారతి కర్పూరం తప్ప.  ఎందుకంటే దీన్ని టర్పంటైన్ ఆయిల్ ఉపయోగించి రసాయన పద్ధతిలో తయారు చేస్తారు. అందుకే వీటిని వెలిగించినప్పుడు నల్లటి పొగతో పాటుగా ప్రమాదకరమైన రేణువులు వెలుపడతాయి. వీటిలో కాలిన కర్బన పదార్థాలు ఉంటాయి. దీని పొగను పీల్చడం వల్ల అది నేరుగా మన ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోతుంది. దీంతో ఉబ్బసం, ఆయాసంతో పాటుగా కొన్ని రకాలు క్యాన్సర్లు కూడా వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

44

ఆలయాల్లో నిషేధించాలని...

రసాయన పద్దతిలో తయారుచేసే కర్పూరాన్ని హారతిగా ఇవ్వడం వల్ల భక్తులు, అర్చకులు అనారోగ్య సమస్యల బారినపడాల్సి వస్తుందని  హిందూ, అర్చక, ధర్మదాయ శాఖలు ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు 2014 నుంచే అనధికారికంగా పలు ఆలయాల్లో కర్పూర హారతిని నిషేధించారు. దీప హారతిని మాత్రమే ఇస్తున్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనీ చాలా ప్రాంతాల్లో దీప హారతులు మాత్రమే ఇస్తున్నారు. కర్పూర హారతిని ఇవ్వడం పూర్తిగా మానేశారు. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇంట్లో కానీ, దేవాలయాల్లో గానీ కర్పూర హారతిని తీసుకోకండి. కర్పూరాన్ని వెలిగించకండి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Recommended image2
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image3
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved