ఒక్క నెల రోజుల పాటు కాఫీని మానేస్తే ఏమవుతుందో తెలుసా?
కాఫీ కూడా వ్యసనమే. దీన్ని రెగ్యురల్ గా తాగేవారు దీనిని తాగకుండా అస్సలు ఉండరు. కానీ కాఫీలో ఉండే కెఫిన్ మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కేవలం ఒక్క నెల రోజుల పాటు మీరు కాఫీకి దూరంగా ఉంటే ఏమౌతుందో తెలుసా?
కాఫీకి ఒక్కసారి అలవాటు పడితే చాలు దీన్ని తాగకుండా అస్సలు ఉండరు. ఎందుకంటే దీని టేస్ట్ అంత అద్బుతంగా ఉంటుంది కాబ్టటి. అందులోనూ కాఫీని తాగితే ఆ వెంటనే ఎనర్జీ వస్తుంది. హుషారుగా మారిపోతారు. కాఫీలో ఉండే కెఫిన్ మనల్ని ఎనర్జిటిక్ గా మారుతుంది. తలనొప్పిని కూడా దూరం చేస్తుంది. అలసట ఇట్టే ఎగిరిపోతుంది. అంతేకాదు దీనితో కూడా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కమ్మని వాసన, టేస్టీగా ఉండే కాఫీతో లాభాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయి. కేవలం ఒక్క నెల రోజుల పాటు కాఫీకి దూరంగా ఉంటే మీలో ఎన్నో మార్పులు వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నెల రోజుల పాటు కాఫీ మానేయడం వల్ల కలిగే లాభాలు
మెరుగైన నిద్ర: కాఫీలో కెఫిన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మనకు నిద్రమత్తుగా లేకుండా చేస్తుంది. అందుకే ఇది మనకు నిద్ర లేకుండా చేస్తుంది. కాఫీలోని కెఫిన్ కంటెంట్ మన నిద్ర విధానాలకు ఆటంకం కలిగిస్తుంది. అందుకే సాయంత్రం 6 తర్వాత కాఫీని అసలే తాగకూడదంటారు నిపుణులు. అయితే ఒక నెల రోజుల పాటు మీరు కాఫీని తాగకుండా ఉంటే మీరు ఎంతో ప్రశాంతంగా, కంటినిండా నిద్రపోతారని నిపుణులు చెబుతున్నారు.
coffee_lovers
తగ్గిన కెఫిన్ డిపెండెన్సీ: టైం టూ టైం కాఫీని తాగేవారున్నారు. ఇలా తాగే వారు సమయానికి కాఫీని తాగకపోతే ఏమీ తోచదు. కొందరికైతే తలనొప్పి కూడా వస్తుంది. అయితే ఒక నెల పాటు ఎలాగోలా కాఫీకి దూరంగా ఉంటే వీరు.. కెఫిన్ పై ఆధారపడే అలవాటు తగ్గుతుంది. అంటే మీరు కాఫీ లేకుండా కూడా ఉండగలుగుతారు.
ఆరోగ్య ప్రయోజనాలు: ఒక నెల పాటు కాఫీని తాగకుండా ఉండటం వల్ల మీ రక్తపోటు స్థాయిలు నియంత్రణలో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా ఉండటం వల్ల యాంగ్జైటీ తగ్గుతుంది. అంతేకాదు కొంతమందికి జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.
ఆర్థిక పొదుపు: కాఫీకి అలవాటు పడితే ఎప్పుడు పడితే అప్పుడు దీన్ని తాగాలనిపిస్తుంది. దీనివల్ల మీ డబ్బు బాగా ఖర్చు అవుతుంది. అయితే ఒక నెల రోజుల పాటు కాఫీ లేకుండా ఉంటే మీకు ఎంతో డబ్బు సేవ్ అవుతుంది.
నెల రోజుల పాటు కాఫీ మానేయడం వల్ల కలిగే నష్టాలు
తలనొప్పి: మీకు రోజూ కాఫీ తాగే అలవాటు ఉంటే.. దీన్ని మానేయడం వల్ల తలనొప్పి, చిరాకు, అలసట వంటి సమస్యలు వస్తాయి.
ఆనందాన్ని కోల్పోవడం: చాలా మంది కాఫీని ఆస్వాదిస్తూ తాగుతారు. ఇది వారిని ఆనందంగా ఉంచుతుంది. అయితే ఇలాంటి వారు నెల రోజుల పాటు కాఫీకి దూరంగా ఉంటే వీళ్లు రోజువారి ఆనందాన్ని కోల్పోతారని నిపుణులు చెబుతున్నారు.
టెంపరరీ ఎనర్జీ డిప్: కాఫీ తక్షణమే ఎనర్జీని ఇస్తుంది. అయితే కాఫీని మానేయడం వల్ల మీరు బలహీనంగా, అలసటగా ఉంటారు. కాఫీ లేకుండా ఉండటానికి శరీరం సర్దుబాటు చేసుకునేంత వరకు ఇలాగే ఉంటుంది.