MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Health
  • ఒక నెల రోజుల పాటు అన్నం తినకపోతే ఏమౌతుందో తెలుసా?

ఒక నెల రోజుల పాటు అన్నం తినకపోతే ఏమౌతుందో తెలుసా?

కార్భోహైడ్రేట్లు, కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారాల్లో బియ్యం ఒకటి. అందుకే బరువు ఎక్కువగా ఉండే వారు అన్నాన్ని తక్కువగా తింటుంటారు. అయితే ఒక నెల పాటు అన్నాన్ని మొత్తమే తినకపోతే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 22 2023, 03:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

భారతదేశంలో చాలా మంది మూడు పూటలా అన్నాన్నే తింటారు. బియ్యంలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. బియ్యం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ వీటిని పాలిష్ చేస్తారు. దీంతో బియ్యం తెల్లగా తల తలా మెరిసిపోతుంటాయి. కానీ ఈ తెల్ల బియ్యంలో పోషకాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. కార్భోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి రైస్ ను తినడం వల్ల బరువు పెరగడంతో పాటుగా రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అన్నాన్ని ఎక్కువగా తింటే మన శరీరంలో కార్బోహైడ్రేట్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. ఈ భయంతోనే  కొంతమంది అన్నం తినకుండా ఉంటారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు అన్నానికి పూర్తిగా దూరంగా ఉంటారు. ఈ విధంగా ఒక నెల రోజుల పాటు బియ్యాన్ని పూర్తిగా మానేయడం వల్ల ఏమౌతుందో ఇప్పుడు తెలుసకుందాం.. 
 

37

నిపుణుల  ప్రకారం.. మీరు ఒక నెల రోజుల పాటు రైస్ ను తినకపోతే ఖచ్చితంగా బరువు తగ్గుతారు. కానీ రైస్ ను నెలంతా తినకపోవడం వల్ల ఆ నెలలోనే మీ బ్లడ్ షుగర్ లెవల్స్ బాగా పడిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి అన్నం తినడం మొదలుపెడితే గ్లూకోజ్ లెవల్స్ మళ్లీ హెచ్చుతగ్గులకు లోనవుతాయని నిపుణులు చెబుతున్నారు. 
 

47
rice

rice

రైస్ ను సరైన పద్ధతిలో కొద్ది మొత్తంలో తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి హాని జరగదని నిపుణులు చెబుతున్నారు. తక్కువ ఫైబర్ ను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ కూడా ప్రభావితం అవుతుంది. కార్బోహైడ్రేట్లు, బి విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు బియ్యంలో పుష్కలంగా ఉంటాయి. బియ్యంతో పాటు కొన్ని కూరగాయలు, ప్రోటీన్ తినడం వల్ల బరువు పెరగకుండా  ఉంటారని నిపుణులు చెబుతున్నారు. మన శరీరంలో "శక్తి ఉత్పత్తికి కార్బోహైడ్రేట్లు చాలా అవసరం. ఇలాంటి అన్నాన్ని పూర్తిగా మానేస్తే వారు బలహీనంగా మారిపోతారు. అంతేకాదు చాలా విటమిన్లు, ఖనిజాల లోపం కూడా ఏర్పడుతుంది. 

57

హోల్ గ్రెయిన్ రైస్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మన గుండె ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా తృణధాన్యాలు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తాయని, గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని మరింత తగ్గిస్తాయని వెల్లడించింది. 
 

 

67

అన్నం వండటం సులువే కాదు అన్నం కూడా చాలా సులభంగా జీర్ణమవుతుంది. బ్రౌన్ రైస్ మాదిరిగా కాకుండా  వైట్ రైస్ లో ఫైటిక్ యాసిడ్ అనే సమ్మేళనం ఉండదు. ఇది జీర్ణ సమస్యలను కలిగించే యాంటీ-న్యూట్రియంట్. బియ్యం సులభంగా జీర్ణమవుతాయి. అలాగే నిద్ర నాణ్యతను కూడా మెరుగుపరుస్తాయి.

77

శుద్ధి చేసిన తెల్ల బియ్యం తిన్నప్పుడు కూడా కరిగే ఫైబర్ ను ఎక్కువ మొత్తంలో పొందుతారు. అంటే బ్యూటిరేట్ అని పిలువబడే రెసిస్టెంట్ స్టార్చ్ ను పొందుతారు. బ్యూటిరేట్ మంటను తగ్గిస్తుంది. దీంతో మీ గట్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అందుకే డయేరియా వచ్చినప్పుడు ఉడకబెట్టిన అన్నం తినాలని డాక్టర్లు సలహానిస్తుంటారు. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved