MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Health
  • వామ్మో.. ఉదయం తినకపోతే బరువు పెరగడంతో పాటు ఇన్ని సమస్యలొస్తయా?

వామ్మో.. ఉదయం తినకపోతే బరువు పెరగడంతో పాటు ఇన్ని సమస్యలొస్తయా?

చాలా మంది ఉదయం పనిలో పడి ఉదయం తిననే తినరు. కానీ ఉదయపు బ్రేక్ ఫాస్టే మన ఆరోగ్యానికి చాలా చాలా అవసరం. ఒకవేళ ఉదయం తినకపోతే మీరు బరువు పెరగడంతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలొస్తాయి తెలుసా? 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Feb 25 2024, 09:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా హెల్తీగా ఫుడ్ ను తినాలి. ముఖ్యంగా ఉదయం ఖచ్చితంగా తినాలి. కానీ చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను ఏదో ఒక కారణంతో స్కిప్ చేస్తుంటారు. కానీ శరీరంలో మెటబాలిజంను ప్రారంభించడంలో బ్రేక్ ఫాస్ట్ యే కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు మంచి హెల్తీ ఫుడ్ మన ఏకాగ్రతను పెంచుతుంది. మానసిక స్థితి మెరుగుపర్చడానికి సహాయపడతుతుంది. ఒకవేళ మీరు ఉదయం తినకపోతే మన శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. ఇది ఎన్నో రోగాలకు దారితీస్తుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మీరు చాలా రోజుల పాటు  ఇలాగే ఉదయం తినకపోతే బరువు పెరగడం, పోషకాల లోపాలతో పాటుగా ఎన్నో రోగాల ముప్పు కూడా ఉంది, కాబట్టి మొత్తం ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను ఖచ్చితంగా తినండి. బ్రేక్ ఫాస్ట్ ను తినేవారు తినని వారికంటే మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. బ్రేక్ ఫాస్ట్ మన మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. మనల్ని షార్ప్ గా ఉంచుతుంది. ఇది మన జ్ఞాపకశక్తిని కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాదు మనల్ని బలంగా, పదునుగా మారుస్తుందని పలు పరిశోధనలు కూడా నిరూపించాయి. 
 

37

రకరకాల పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు, ప్రోటీన్ ఉన్న ఆహారాలను తింటే మన ఏకాగ్రత పెరుగుతుంది. తృణధాన్యాలు, ప్రోటీన్, ఫైబర్, మంచి కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారాలు మీ శరీరానికి శక్తిని అందించడానికి సహాయపడతాయి. అంతేకాదు బ్రేక్ ఫాస్ట్ మీ శరీరాన్ని రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. మరి బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేయడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

47

ఏకాగ్రత

సమతుల్య అల్పాహారం మన మెదడుకు అవసరమైన గ్లూకోజ్ ను అందిస్తుంది. ఒకవేళ మీరు బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తే మీ ఏకాగ్రత, జ్ఞాపకశక్తితో పాటుగా మొత్తం అభిజ్ఞా పనితీరు తగ్గుతుంది. అలాగే మీరు పనిచేసే సామర్థ్యం కూడా తగ్గుతుంది. 
 

57

బరువు పెరగడం, ఊబకాయం

ఉదయాన్నే భోజనం మానేయడం వల్ల బరువు తగ్గుతామని చాలా మంది నమ్ముతారు. కానీ ఇది ఒక అపోహ మాత్రమే. నిజమేంటంటే? ఉదయం తినకపోవడం వల్ల మీరు మరింత బరువు పెరిగే అవకాశం ఉంది. మీరు ఉదయం తినకపోతే మధ్యాహ్నం హెవీగా తింటారు. ఇది మీ శరీర మెటబాలిజానికి అంతరాయం కలిగిస్తుంది. దీంతో మీరు విపరీతంగా బరువు పెరిగిపోతారు.
 

67
Image: Jill Willington

Image: Jill Willington

పోషకాహార లోపం 

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అవసరమైన పోషకాలు, ఖనిజాలు ఉన్న బ్రేక్ ఫాస్ట్ ను తినాలి. మీరు ఉదయం తినకపోతే పోషక లోపాల ప్రమాదం పెరుగుతుంది. ఇది వివిధ శారీరక విధులను ప్రభావితం చేస్తుంది. అంతేకాదు ఇది మీకు ఎన్నో రోగాలు వచ్చేలా చేస్తుంది. 
 

77

మూడ్ స్వింగ్స్

ఉదయం తినకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయి. అలాగే మూడ్ స్వింగ్స్, చిరాకు వంటి సమస్యలు కూడా వస్తాయి. సమతుల్య అల్పాహారం రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది.
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved