MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • ప్రెగ్నెన్సీ తోనే కాదు వీటివల్ల కూడా పీరియడ్స్ మిస్ అవుతాయి తెలుసా?

ప్రెగ్నెన్సీ తోనే కాదు వీటివల్ల కూడా పీరియడ్స్ మిస్ అవుతాయి తెలుసా?

పీరియడ్స్ రాకపోయే సరికి చాలాసార్లు ఆడవాళ్లు కంగారు పడిపోతుంటారు. రెండు మూడు రోజులు పీరియడ్స్ ఆలస్యంగా రావడం చాలా సహజమే. కానీ ఇంకా ఎక్కవ రోజులు పీరియడ్స్ రాకపోవడం ఎన్నో రోగాలకు సంకేతం కావొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.  

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Sep 16 2023, 11:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

పీరియడ్స్ ఒక సాధారణ ప్రక్రియ. అయితే కొంతమందికి ఈ పీరియడ్స్ సక్రమంగా రావు. దీంతో ఎంతో కంగారు పడిపోతుంటారు. పీరియడ్స్ మిస్ కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ప్రెగ్నెన్సీ. గర్భం దాల్చితే పీరియడ్స్ రావు.  ప్రెగ్నెన్సీతో పాటుగా మరికొన్ని కారణాల వల్ల కూడా పీరియడ్స్ మిస్ అవుతాయి. ఇది మీ శరీరంలో ఎన్నో మార్పులను కలిగిస్తుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

పీరియడ్స్ మిస్ కావడం ఎంత కాలం సాధారణం?

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. 21-30 రోజుల పీరియడ్ చక్రం సాధారణం. కానీ 6 వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పీరియడ్స్ రాకపోతే మీ పీరియడ్స్ మిస్ అయ్యాయని అర్థం. మరి పీరియడ్స్ మిస్ అవ్వడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

37

ఒత్తిడి

ప్రస్తుత కాలంలో ఒత్తిడితో బాధపడేవారు ఎక్కువయ్యారు. ఈ ఒత్తిడి ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే ఒత్తిడి వల్ల కూడా పీరియడ్స్ ఆలస్యంగా వస్తాయని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఒత్తిడి హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. దీని వల్ల మీ పీరియడ్స్ సమయానికి రావు. అలాగే పీరియడ్స్ సమయంలో విపరీతమైన కడుపు నొప్పి, తిమ్మిరి సమస్యలు కూడా వస్తాయి. 
 

47

ఊబకాయం

ఊబకాయం కూడా పీరియడ్స్ మిస్ కావడానికి ఒక కారణం కావొచ్చు. బరువు ఎక్కువున్న ఆడవారి శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల పీరియడ్స్ పై ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

57
<p>periods</p>

<p>periods</p>

బరువు తగ్గడం

ఉండాల్సిన బరువు కంటే మరీ తక్కువగా ఉన్నవారికి కూడా తరచుగా పీరియడ్స్ మిస్ అవుతుంటాయి. మీరు శారీరక శ్రమ ఎక్కువగా చేస్తుంటే, మీ బరువు వేగంగా తగ్గుతుంటే మీ శరీరంలో హార్మోన్ల అసమతుల్యంగా ఉంటాయి. దీంతో మీరు పీరియడ్స్ ను మిస్ అవుతుంటారు. 

67

జనన నియంత్రణ మందులు

గర్భధారణను నివారించడానికి చాలా మంది ఆడవారు ఎక్కువగా గర్భనిరోధక మందులను వాడుతుంటారు. కానీ వీటిని ఉపయోగించడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం ఎంతో దెబ్బతింటుంది. అలాగే చాలాసార్లు పీరియడ్స్ కూడా మిస్ అవుతాయి.

77

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ లేదా పీసీఓఎస్ ఉన్న మహిళలకు కూడా పీరియడ్స్ మిస్ అయ్యే సమస్య వస్తుంది. వీరిలో ఆండ్రోజెన్ స్థాయి పెరుగుతుంది. కొన్నిసార్లు అండాశయం తిత్తిగా కూడా మారుతుంది. దీనివల్ల పీరియడ్స్ సక్రమంగా రావు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
Latest Videos
Recommended Stories
Recommended image1
Chicken Biryani: 30 నిమిషాల్లో ఘుమఘుమలాడే పొట్లం బిర్యానీ.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..
Recommended image2
Jaggery: బెల్లం ఎలా తింటున్నారు..? ఇలా తింటేనే ప్రయోజనం ఉంటుంది
Recommended image3
Barley Water: ఉదయాన్నే బార్లీ తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved