పరిగడుపున ఇవి తాగితే మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వు ఇట్టే కరుగుతుంది..
శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల గుండె జబ్బుల నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే ఉదయం పరిగడుపున కొన్ని పానీయాలను తాగితే ఫ్యాట్ కరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

belly fat
అదనపు కొవ్వు ఎన్నో ప్రమాదకరమైన రోగాలతో ముడిపడి ఉంది. శరీరంలో కొవ్వు పేరుకుపోతే గుండె పోటు రావొచ్చు. స్ట్రోక్ కూడా రావొచ్చు. ఇవేంటి ఎన్నో ప్రాణాంతక రోగాలు వస్తాయి. శరీరంలో కొవ్వు ఇలా పేరుకుపోవడానికి మన జీవన శైలి, ఆహారం, శారీరక శ్రమ చేయకపోవడం వంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఏదేమైనా మనం ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం కొవ్వును కరిగించాల్సిందే. అయితే ఉదయాన్నే ఆరోగ్యకరమైన పానీయాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా కడుపులో విషాన్ని బయటకు పంపడానికి, జీర్ణక్రియను ప్రోత్సహించడానికి సహాయపడతాయి. ఇవి బరువు తగ్గేందుకు కూడా సహాయపడతాయి. ఇందుకోసం పరిగడుపున ఎలాంటి పానీయాలను తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం..
జీలకర్ర నీరు
ఉదయాన్నే పరగడుపున జీలకర్ర నీటిని తాగడం వల్ల బరువు తగ్గుతారని అధ్యయనాలు చెబుతున్నాయి. హెల్త్ లైన్ ప్రకారం.. జీలకర్ర కాలేయం నుంచి పిత్త విడుదలను కూడా పెంచుతుంది. మీ గట్లోని కొవ్వులు, కొన్ని పోషకాలను జీర్ణం చేయడానికి పిత్తం సహాయపడుతుంది. జీలకర్ర జీర్ణ ప్రోటీన్ల కార్యాచరణను పెంచుతుంది. దీంతో జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది.
amla juice
ఉసిరి నీరు
ఉసిరికాయ ఫైబర్, ఐరన్, కాల్షియం, విటమిన్ సి, విటమిన్ ఎ కు అద్భుతమైన మూలం. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఎక్కువగా ఉన్నందున ఉసిరికాయ రసాన్ని ఉదయాన్నే తీసుకోవడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. అలాగే కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది. భోజనానికి ముందు ఒక గ్లాసు ఉసిరికాయ రసం తాగడం వల్ల మీరు అతిగా తినలేరు. అంతేకాదు దీనిలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్, టానిక్ ఆమ్లం ఊబకాయం, మలబద్ధకం లక్షణాలను తగ్గిస్తాయి.
నిమ్మరసం, తేనె, నీళ్లు
నిమ్మకాయ,తేనె కలిపిన వాటర్ మలబద్దకాన్ని తగ్గించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి బాగా సహాయపడుతుంది. ఇది పెద్దప్రేగును శుద్ధి చేయడానికి, జీర్ణంకాని ఆహారం, విషాన్ని శరీరం నుంచి తొలగించడానికి సహాయపడుతుంది.
దాల్చిన చెక్క నీరు
దాల్చిన చెక్క నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనె కలుపుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది. ఎన్నో అధ్యయనాల ప్రకారం.. తేనె ఆకలిని తగ్గించడానికి సహాయపడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లు కూడా దీనిలో పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దాల్చినచెక్క రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. జీవక్రియపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అంటే దాల్చిన చెక్క నీటిని తాగితే జీవక్రియ పెరుగుతుంది. దీంతో మీరు వేగంగా బరువు తగ్గుతారు.