బరువు తగ్గాలనుకుంటే ఈ పనులు చేయడం మానండి..
బరువు తగ్గడానికి కాస్త ఓపిక అవసరం. ఒకటి రెండు రోజుల్లోనే బరువు తగ్గమంటే కష్టం. కానీ చాలా మంది బరువు తగ్గే ప్రాసెస్ లో కొన్ని తప్పులు చేస్తుంటారు. వాటివల్లే బరువు తగ్గడం కష్టమవుతుందని నిపుణులు అంటున్నారు.

weight loss
బరువు తగ్గే ప్రాసెస్ కు డెడ్ లైన్ ఉండదు. ఇది ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ప్రయత్నాలను సక్రమంగా చేస్తే కొన్ని రోజుల్లోనే మీరు కోరకున్న ఫలితాలను పొందుతారు. అయితే చాలా మంది చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆశించిన ఫలితాలను పొందలేకపోతున్నారు. కానీ ఇవి ఎక్కువ కాలం కొనసాగితే మాత్రం వాటితో ఎన్నో ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటారని నిపుణులు అంటున్నారు. అసలు బరువు తగ్గాలనుకునే వారు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
weight loss
తినడం మానేయొద్దు
బరువు తగ్గాలనుకునే వారు చేసే మొదటి పని ఇదే. బరువు తగ్గాలంటే తినడం పక్కాగా మానేయాల్సిందేనని భావిస్తుంటారు. తక్కువగా తినడం వల్ల మీ బరువులో కాస్త మార్పు కనిపించినా ఇది తక్కువ కాలం వరకు మాత్రమే ఉంటుంది. ఫుడ్ ను తక్కువగా తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే శరీరంపై ప్రతికూల ప్రభావాలు పడతాయి. అందుకే మరీ ఎక్కువగా కాకుండా.. మరీ తక్కువగా కాకుండా పోషకాహారాన్ని తినండి.
weight loss tips
జిమ్ సెషన్లు మిస్ చేయొద్దు
జస్ట్ ఇది ఒక సెషన్ మాత్రమే. దీనిని పెద్దగా పట్టించుకోనవసరం లేదని చాలా మంది భావిస్తారు. ఇందుకోసమే జిమ్ కు బ్రేక్ ఇస్తుంటారు. కానీ ఇలా అప్పుడప్పుడు జరిగితే మీకు దానిపై ఉన్న ఇంట్రెస్ట్ కాస్త పోతుంది. ఇది మీరు మళ్లీ బరువు పెరిగేందుకు దారితీస్తుంది. అందుకే జిమ్ సెషన్లను ఒక్కసారి కూడా మిస్ కాకండి.
తరచుగా తినడం మానేయండి
బరువు తగ్గాలనుకునేవారు తరచుగా తింటుంటారు. కానీ ఇది మీరు మరింత బరువు పెరగడానికి దారితీస్తుంది. మనలో చాలా మంది వారి శరీరరకం, ఆరోగ్య పరిస్థితి, వారు తీసుకుంటున్న మందుల కారణంగా తరచుగా ఆహారాన్ని తినాల్సి ఉంటుంది. మీరు మీ బరువులో మార్పును గమనించినట్టైతే తరచుగా తినడం మానుకోండి.
అతి వ్యాయామంతో ప్రయోజనం ఉండదు
ఎంత ఎక్కువ వ్యాయామం చేస్తే అంత త్వరగా బరువు తగ్గుతారని చాలా మంది అనుకుంటూ ఉంటారు. వాస్తవం ఏంటంటే.. వ్యాయామ సెషన్ల తర్వాత మీ శరీరానికి మంచి మొత్తంలో విశ్రాంతి అవసరం. ఇది తదుపరి వ్యాయామానికి ముందు శరీరంలోని కండరాలను సరిగ్గా మరమ్మత్తు చేయడానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలని మరీ వ్యాయామాన్ని ఎక్కువగా చేస్తే మీ శరీరంలో సత్తువ తగ్గి సమస్యలొస్తాయి.
డైట్ ట్రెండ్స్ జోలికి పోవద్దు
బరువు తగ్గే ప్రాసెస్ ఎప్పుడూ ఆరోగ్యకరమైన పద్ధతిలోనే ఉండాలి. ఏదైనా డైట్ పాటించే ముందు వైద్యుడిని సంప్రదించండి. ఎందుకంటే అన్ని రకాల డైట్లు అందరినీ ఒకేవిధంగా ప్రభావితం చేయకపోవచ్చు. బరువు తగ్గడం అనేది అదనపు కిలోలను తగ్గించడానికి ఆరోగ్యకరమైన విధానాన్నే అనుసరించాలి.
weight loss
కేలరీలను లెక్కించడం
వెయిట్ లాస్ కోసం ప్రయత్నిస్తున్నవారు తరచుగాచేసే మిస్టేక్ ఇదే. కోల్పోయిన కేలరీలను లెక్కించడం ప్రారంభిస్తారు. మీ పురోగతి గురించి తెలుసుకోవడం మంచిది. కానీ ఇది వ్యక్తిపై అదనపు భారాన్ని కలిగిస్తుంది. బరువు తగ్గడం అంటే కేవలం కేలరీలు తీసుకోవడం, బర్న్ చేయడం మాత్రమే కాదు. దీనిలో ఎన్నో అంశాలు ఉన్నాయి. అందుకే కేలరీలను లెక్కించడం మానుకోండి.