Health Tips: బెల్లీ ఫ్యాట్ ని కరిగించే హెల్దీ డ్రింక్స్..ఎంతటి బానపొట్ట అయిన కరిగి తీరాల్సిందే!
Health Tips: ప్రస్తుత సమాజంలో బాన పొట్టతో బాధపడుతున్న వారు చాలామంది ఉన్నారు. వారి పొట్టని కరిగించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ హెల్తీ డ్రింక్స్ తాగడం వల్ల ఎంతటి బాని పొట్ట అయినా కరిగి తీరుతుందట. అదేంటో చూద్దాం.
బెల్లి ఫ్యాట్ అనేది కేవలం ఒక ఎక్స్ట్రా ఫ్యాట్ లేయర్ మాత్రమే కాదు, కింద లోపల మొత్తం కొవ్వు ఉంటుంది అది పొట్ట యాంక్రియాస్ మరియు ఇంటస్టైన్స్ వద్ద ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎన్నో అనారోగ్యాలకి దారితీస్తుంది ఈ బాన పొట్ట. హై బ్లడ్ ప్రెషర్, హృదయ సంబంధిత సమస్యలు..
డయాబెటిస్, జీర్ణ సంబంధ సమస్యలు మొదలైనవన్నీ ఈ బెల్లీ ఫ్యాట్ వల్లే సంభవిస్తాయి. అయితే ఈ బెల్లీ ఫ్యాట్ అనేది సరియైన జీవన విధానం లేకపోవటం వలన, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వలన అలాగే టైం తో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తినటం వలన..
తిండికి తగ్గ శరీర వ్యాయామం లేకపోవడం వలన ఈ బెల్లీ ఫ్యాట్ సంభవిస్తుంది. అయితే సరైన జీవన విధానాన్ని పాటించి మంచి డైట్ ని పాటిస్తే ఈ సమస్య నుంచి సులువుగా బయటపడవచ్చు. అలాగే కొన్ని హెల్త్ డ్రింక్స్ కూడా బెల్లీ ఫ్యాట్ ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
గ్రీన్ టీ లేదా అల్లం టీ తాగడం వల్ల బ్రెయిన్ యాక్టివిటీ ని పెంచుతుంది. అలాగే మెటబాలిజం కూడా పెంచుతుంది. గ్రీన్ టీ కొవ్వును కరిగించడంలో చక్కగా పనిచేస్తుంది. గ్రీన్ టీ లో కొద్దిగా నిమ్మరసం పిండి అందులో కొంచెం అల్లం యాడ్ చేసుకుని తాగితే మంచి ప్రయోజనాలు కనబడతాయి.
అలాగే కీర మరియు అల్లం రసం తాగడం వల్ల కూడా బెల్లీ ఫ్యాట్ త్వరగా తగ్గుతుంది. అల్లం లో ఉండే గుణాలు గ్యాస్ట్రో ఇంట్రెస్టినల్ సమస్యలని దూరం చేస్తే కీరదోసలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.
ఈ మిశ్రమాన్ని జ్యూస్గా తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ సమస్య త్వరగా తీరిపోతుంది. అలాగే శరీరానికి అవసరమైన స్వచ్ఛమైన మంచినీరు తాగడం కూడా బాన పొట్ట తగ్గటానికి ఎంతో అవసరం. అలాగే కొబ్బరి నీరు కూడా బాన పొట్టని తగ్గించడంలో బాగా సహాయపడుతుంది.