పొట్ట తగ్గాలంటే మధ్యాహ్నం అన్నానికి బదులు వీటిని తినండి
బరువు తగ్గాలనుకునేవారు వీలైనంత వరకు మధ్యాహ్నం, రాత్రి పూట అన్నానికి దూరంగా ఉండాలి. అన్నంలో కేలరీలు, కార్భోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే అన్నాన్ని తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుంది.

బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడం చాలా కష్టం. పొట్టను తగ్గించుకోవడానికి, బరువు తగ్గడానికి ముందుగా మీరు చేయాల్సిన మొదటి పని ఆహారపు అలవాట్లను మార్చుకోవడం. అలాగే జీవనశైలిని మెరుగ్గా ఉంచుకోవాలి. బరువు తగ్గాలనుకునే వారు వీలైనంత వరకు మధ్యాహ్నం, రాత్రి పూట అన్నం తినకూడదు. ఎందుకంటే బియ్యంలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే అన్నాన్ని తింటే బరువు పెరుగుతారు. శరీరంలో కొవ్వు పెరుగుతుంది. మరి బరువు తగ్గాలనుకునే వారు మధ్యాహ్నం, రాత్రి పూట అన్నానికి బదులు ఏమేం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
చపాతీలు
అన్నానికి బదులుగా చపాతీలను తినడం చాలా మంచిది. ఎందుకంటే ఇది మీ శరీర బరువును తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. అందుకే మధ్యాహ్నం, రాత్రి పూట అన్నానికి బదులుగా చపాతీలను తినండి.
Image: Getty Images
ఓట్ మీల్
ఓట్స్ బరువు తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఒక కప్పు ఓట్ మీల్ లో 7.5 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అంతేకాదు వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఓట్స్ ప్రోటీన్ కు మంచి వనరు. ఇది కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునే మధ్యాహ్నం, రాత్రి పూట అన్నానికి బదులుగా ఓట్ మీల్ ను తినండి.
బార్లీ
బియ్యం కంటే బార్లీలోనే ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. బార్లీలో విటమిన్ బి, జింక్, సెలీనియం, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని అన్నానికి ప్రత్యామ్నాయంగా ఆహారంలో చేర్చుకుంటే సులువుగా బరువు తగ్గుతారు.
apples
యాపిల్స్
యాపిల్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రోజూ ఆపిల్ ను తినడం వల్ల ఎప్పుడూ ఆకలి అయ్యే ఛాన్స్ తగ్గుతుంది. అంతేకాదు ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. కాబట్టి ఆపిల్ ను తినడం వల్ల ఆకలి తగ్గి ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.
గుడ్లు
గుడ్లు మంచి పోషకాహారం. గుడ్లను ఉడకబెట్టి, ఆమ్లెట్ లేదా కూరగా చేసుకుని తినొచ్చు. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలనుకునే వారికి గుడ్లు మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. గుడ్లు పోషకాల లోపాలను కూడా పోగొడుతాయి.
పండ్ల సలాడ్
అలాగే మధ్యాహ్నం, రాత్రి పూట పండ్ల సలాడ్ ను తీసుకోవడం కూడా మంచి ప్రయోజకరంగా ఉంటుంది. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే బెర్రీలను తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారు.
Image: Getty Images
గింజలు
గింజలు కూడా బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి బాగా సహాయపడతాయి. ఫైబర్ పుష్కలంగా ఉండే నట్స్ బరువును, అపానవాయువును తగ్గించడానికి సహాయపడతాయి. గింజలు మీ కడుపును త్వరగా నింపడానికి కూడా సహాయపడతాయి. అందుకే బాదం, వాల్ నట్స్, పిస్తా వంటి గింజలను మధ్యాహ్నం, రాత్రి పూట తీసుకోండి.