ఈ ఫుడ్ తింటే.. బరువు తగ్గడానికి డైట్ అవసరం లేదు..!
..కొన్ని రకాల ఫుడ్స్ కాంబినేషన్ లో తీసుకువడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వును కరిగిస్తాయట. దీంతో.. సులభంగా బరువు తగ్గవచ్చట. మరి ఆ ఫుడ్ కాంబినేషన్స్ ఏంటో ఓసారి చూద్దాం..
weight loss
ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఆ బరువు తగ్గించేందుకు చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జిమ్ ల వెంట పరిగెడతారు.ఏవేవో డైట్స్ చేస్తూ ఉంటారు. చాలా మంది అయితే ఏకంగా కడుపు మాడ్చేసుకుంటూ ఉంటారు. అయితే... కొన్ని రకాల ఫుడ్ కాంబినేషన్స్ తీసుకుంటే.. స్పెషల్ గా బరువు తగ్గడానికి వేరే ఏ ఇతర డైట్స్ చేయాల్సిన అవసరం లేదట.
weight loss
మీరు చదివింది నిజమే..కొన్ని రకాల ఫుడ్స్ కాంబినేషన్ లో తీసుకువడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వును కరిగిస్తాయట. దీంతో.. సులభంగా బరువు తగ్గవచ్చట. మరి ఆ ఫుడ్ కాంబినేషన్స్ ఏంటో ఓసారి చూద్దాం..
green tea
గ్రీన్ టీ , నిమ్మకాయ
గ్రీన్ టీ ఆరోగ్యకరమైన పానీయం. ఇందులో క్యాటెచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి క్యాలరీలను సులభంగా బర్న్ చేస్తాయి. రక్తంలో చక్కెర, రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మరింత విటమిన్ సి లక్షణాల కోసం నిమ్మకాయను కూడా జోడించవచ్చు. ఈ కాంబినేషన్ బరువు తగ్గడానికి ఎక్కువగా సహాయపడుతుంది.
పండ్లు, కూరగాయలు , ఆలివ్ నూనె
ఆలివ్ ఆయిల్ ఆరోగ్యకరమైన నూనె ఎంపికలలో ఒకటి. పండ్లు, కూరగాయలతో కలిపినప్పుడు ఇది బరువు తగ్గించే ప్రక్రియలో సహాయపడుతుంది.
బెర్రీతో వోట్మీల్
ఓట్ మీల్ పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన అల్పాహార ప్రత్యామ్నాయం. బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. పండ్లతో కూడిన ఓట్ మీల్ రోజును ప్రారంభించడానికి మంచి ఎంపిక. బెర్రీలు కరిగే ఫైబర్ , ఇతర పోషకాలను కలిగి ఉన్నందున అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడే పండ్లలో ఒకటి.
digestion
చియా సీడ్స్ పుడ్డింగ్
ఈ చిన్న చియా విత్తనాలు గొప్ప పోషక లక్షణాలతో నిండి ఉన్నాయి. ఇది మంచి ఆరోగ్యకరమైన అల్పాహార సప్లిమెంట్, ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో మంచి ఫైబర్ , ఒమేగా 3 కంటెంట్ ఉంటుంది.