బరువు తగ్గడం కోసం సెలబ్రెటీలు తాగే డీటాక్స్ డ్రింక్స్ ఇవే..!
బరువు తగ్గడం కోసం చాలా మంది డీటాక్స్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. ఆ జాబితాలో సెలబ్రెటీలు కూడా ఉన్నారు. మరి ఏ సెలబ్రెటీలు ఎలాంటి డీటాక్స్ డ్రింక్స్ తాగుతారో ఓసారి చూద్దాం..

బరువు తగ్గడం కోసం చాలా మంది డీటాక్స్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. ఆ జాబితాలో సెలబ్రెటీలు కూడా ఉన్నారు. మరి ఏ సెలబ్రెటీలు ఎలాంటి డీటాక్స్ డ్రింక్స్ తాగుతారో ఓసారి చూద్దాం..
shilpa shetty
1.శిల్పా శెట్టి...
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి మాట ఎత్తగానే... ఆమె ఫిట్నెస్ టాపిక్ వస్తుంది. ఫిట్నెస్ విషయంలో ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కాగా... శిల్పా శెట్టి... ఫ్యాట్ బర్నింగ్ కోసం సీసీఎఫ్ డ్రింక్ తాగుతారట. అంటే... దాల్చిన చెక్క, జీలకర్ర, మెంతులు కలిపిన డ్రింక్ ని తాగుతారు.ఈ ముడింటిని కొద్దిగా వెచ్చ చేసి... మెత్తని పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నీటిలో కలుపుకొని తాగాలి. ఇది శరీరంలో కొవ్వను కరిగించడానికి సహాయం చేస్తుంది.
2.షెహనాజ్ గిల్...
బాలీవుడ్ నటి, బిగ్ బాస్ బ్యూటీ షెహనాజ్ అంతకముందు చాలా బొద్దుగా ఉండేది. అలాంటిది ఆమె తర్వాత సన్నజాజి తీగలా మారారు. అందుకోసం ఆమె ఓడీటాక్స్ డ్రింక్ తాగేవారట. ఆమె వేడి నీటిలో చిటికెడు పసుపు వేసి.. ఆ తర్వాత దానిని బాగా కలిపి తాగేవారట.
3.మలైకా అరోరా...
మలైకా అరోరా కూడా ఫిట్నెస్, డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆమె తన డీటాక్స్ డ్రింక్ ని మెంతులతో కలిపి తీసుకుంటారు. మెంతులు, జీలకర్ర లను రాత్రిపూట నీటిలో నానపెట్టి... ఉదయాన్నే పరగడుపున ఈ నీటిని తాగితే..శరీరంలోని టాక్సీన్స్ అన్నీ బయటకు వెళతాయి.
4.భూమి పడ్నేకర్...
బాలీవుడ్ బ్యూటీ భూమి పడ్నేకర్ కూడా.. ప్రతిరోజూ డీటాక్స్ వాటర్ తాగుతూ ఉంటారు.దాని కోసం ఆమె.. ఒక లీటర్ నీటిలో... దానిలో మూడు కీర దోస, నాలుగు నిమ్మకాయలు తీసుకుంటారు. వీటిని నీటిలో నానపెట్టి.... రోజంతా ఆ నీటిని తాగుతూ ఉంటారు.