క్యాన్సర్ నుంచి బరువు పెరగడం వరకు.. చక్కెరతో ఈ రోగాలు ఖాయం..
తీపి టేస్టీగా ఉంటుంది. కానీ చక్కెర మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీన్ని ఎక్కువగా తీసుకుంటే బరువు పెరగడం నుంచి క్యాన్సర్ ముప్పు వరకు ఎన్నో రోగాలు వస్తాయి.

Image: Getty Images
మనలో చాలా మంది చక్కెరను ఇష్టంగా తింటుంటారు. కానీ చక్కెరతో చేసిన తీపి పదార్థం మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. చక్కెర మన నడుము సైజును పెంచడం నుంచి దీర్ఘకాలిక వ్యాధుల వరకు ఎన్నో అనారోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. చక్కెరను ఎక్కువగా తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలొస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Image: Getty Images
బరువు పెరగడం
ప్రపంచ వ్యాప్తంగా ఊబకాయుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. చక్కెరతో చేసిన స్వీట్లు, పానీయాలు ఊబకాయం, బరువు పెరగడానికి దారితీస్తాయి. సోడాలు, రసాలు, తియ్యని టీ వంటి చక్కెర పానీయాలు ఫ్రక్టోజ్ అనే సాధారణ చక్కెరతో నిండి ఉంటాయి.
Image: Getty Images
క్యాన్సర్
ఎకక్కువ మొత్తంలో చక్కెరను తినడం వల్ల కొన్ని క్యాన్సర్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు, పానీయాలు ఊబకాయానికి దారితీస్తాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా ఎక్కువగా పెంచుతాయి.
Image: Freepik
వాపు, మొటిమలు
ఎక్కువ మొత్తంలో చక్కెరను తీసుకోవడం వల్ల శరీరంలో మంట పెరుగుతుంది. ఇది చర్మంపై మొటిమలను పుట్టిస్తుంది. చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది అదనపు సెబమ్ ఉత్పత్తికి, రంధ్రాలు మూసుకుపోవడం, మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియా పెరుగుతుంది.
Image: Getty Images
డిప్రెషన్
ఆరోగ్యకరమైన ఆహారం మీ మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అదనపు చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా ఉన్న ఆహారం మానసిక స్థితిని, భావోద్వేగాలలో మార్పులకు కారణమవుతుంది. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. చక్కెర డిప్రెషన్ కు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు.
sugar
చర్మం-వృద్ధాప్య ప్రక్రియ
ముడతలు చర్మం వృద్ధాప్యానికి సహజ సంకేతం. అయితే ఇవి మీ ఆరోగ్యంతో సంబంధం లేకుండా కనిపిస్తాయి. అయినప్పటికీ పేలవమైన ఆహారం ముడతలను మరింత తీవ్రతరం చేస్తాయి. అలాగే చర్మ వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తాయి. ఇది చర్మం వృద్ధాప్యం, ముడతలు ఏర్పడటాన్ని వేగవంతం చేస్తుంది.