ఆకలి పెరగాలంటే ఇలా చేయండి..
ఆకలి కాకపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ ఇది మీరు బరువు పెరగకుండా చేయడమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా కలిగిస్తుంది. అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో ఆకలిని పెంచొచచ్చు.

ఆకలి లేకపోవడం లేదా తక్కువగా ఉండటం వెయిట్ లాస్ అయ్యేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ సన్నగా ఉన్నవారికి ఇది మంచిది కాదు. ఇది పోషకాల లోపానికి, నిరసానికి, ఇంకా బక్కగా కావడం వంటి సమస్యలకు దారితీస్తుంది. నిజానికి ఉండాల్సిన దానికంటే బరువు తక్కువగా ఉంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.
ఫుడ్ ను తినాలనే కోరిక చాలా తక్కువగా ఉన్నప్పుడు ఆకలి ఉండదు. ఇది వివిధ మానసిక, శారీరక అనారోగ్యాల వల్ల కావొచ్చు. అయినప్పటికీ మీరు తక్కువ బరువు ఉంటే, తక్కువ ఆకలి కారణంగా పోషక లోపాలు ఉంటే ఇది నిరాశను కలిగిస్తుంది. ఈ ఆకలి లేకపోవడం కొన్ని రోజుల కంటే ఎక్కువ కాలం ఉంటే మీరు బాగా బరువు తగ్గుతారు. అలాగే పోషకాహార లోపానికి గురవుతారు. ఇలాంటి సమస్య వస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లడం మంచిది. సహజంగా ఆకలిని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
eating
తక్కువగా ఎక్కువ సార్లు తినడం
మీరు బరువు పెరగాలన్నా.. ఆకలి బాగా కావాలన్నా.. ఒకే సారి ఎక్కువగా కాకుండా రోజంతా కొద్ది కొద్దిగా రోజంతా నాలుగైదు సార్లు తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా భోజనం తీసుకోవడానికి ప్రయత్నిస్తే మీరు కేలరీలను ఎక్కువగా తీసుకుంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఒకేసారి ఎక్కువ మొత్తంలో తింటే కడుపు ఉబ్బుతుంది. ఇది ఆకలి తగ్గడానికి దారితీస్తుంది. అందుకే దీనికి బదులుగా కొంచెం కొంచెమే తినండి. దీంతో మీరు ఎనర్జిటిక్ గా ఉంటారు.
పోషకాహారం
పోషకాలు, కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారాన్నే ఎంచుకోండి. అవోకాడోలు, కాయలు, విత్తనాలు, గింజల వెన్న, ఆలివ్ ఆయిల్, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్, పాల ఉత్పత్తులు, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి ఆహారాలను మీ రోజువారి ఆహారంలో చేర్చండి.
ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం
కండరాల పెరుగుదల, మరమ్మత్తుకు ప్రోటీన్ చాలా చాలా అవసరం. అందుకే మీ భోజనంలో సన్నని మాంసాలు, పౌల్ట్రీ, చేపలు, గుడ్లు, చిక్కుళ్లు, పాల ఉత్పత్తులు, టోఫు వంటి మొక్కల ఆధారిత ప్రోటీన్ ను మీ ఆహారంలో చేర్చండి. ఇవి ప్రోటీన్ కు మంచి వనరులు.
హైడ్రేట్ గా ఉండండి
రోజంతా నీటిని పుష్కలంగా తాగండి. ఇది మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడమే కాకుండా మీ శరీరాన్ని జీర్ణక్రియకు సిద్ధం చేయడానికి సహాయపడుతుంది. మొత్తం ఆరోగ్యం, ఆకలికి మద్దతు ఇవ్వడానికి హైడ్రేటెడ్ గా ఉండటం చాలా ముఖ్యం.
food
క్రమం తప్పకుండా వ్యాయామం
వ్యాయామం మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే మీకు ఆకలిని కూడా కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కండర ద్రవ్యరాశిని నిర్మించడానికి బలం శిక్షణ వ్యాయామాలను చేయండని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం మీ జీర్ణ ప్రక్రియను ఉత్తేజపరుస్తుంది. అలాగే మీ ఆకలిని పెంచుతుంది. ఇంటెన్సివ్ లేదా హెచ్ఐఐటి శిక్షణ చేయండి. ఇది మీ శరీరాన్ని అలసిపోయేలా చేస్తుంది. దీంతో మీకు బాగా ఆకలి అవుతుంది.