ఈ ఒక్కదాంతో నోట్లో నుంచి వాసన రాదు. గ్యాస్ సమస్యా ఉండదు
చాలా మందికి నోట్లో నుంచి దుర్వాసన వస్తుంటుంది. అలాగే కడుపులో గ్యాస్ ఎక్కువ అవుతుంది. ఒక్కొక్కరికీ ఈ రెండు సమస్యలూ ఉంటే.. కొంతమందికి వీటిలో ఒక్కటి ఉంటుంది. కానీ ఈ సమస్యలను తగ్గించడానికి వాము చాలా ఎఫెక్టీవ్ గా పనిచేసతుంది.
ప్రస్తుత కాలంలో చాలా మందికి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఆకలి లేకపోవడం, అజీర్ణం, మలబద్దకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఈ రోజుల్లో సర్వ సాధారణమయిపోయాయి. సరైన ఆహారాలను తినకపోవడం, జీవనశైలి సరిగ్గా లేకపోవడమే ఇందుకు కారణాలు.
ఇకపోతే కొంతమంది ఉదయం కడుపును సరిగ్గా ఖాళీ చేయరు. అలాగే మరికొంతమందికి తిన్న వెంటనే కడుపు ఉబ్బిపోతుంటుంది. దీనికి కారణం కడుపులో వాయువు ఎక్కువగా ఏర్పడటం. అలాగే నోటి దుర్వాసన కూడా అజీర్ణాన్ని సూచిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంటే ఇలాంటి వారికి జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదని అర్థం. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కడుపు నొప్పి, అజీర్ణం, కడుపులో గ్యాస్, నోటి దుర్వాసన వంటి సమస్యలను తగ్గించడానికి వాము చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
వామును ఉపయోగించి జీర్ణక్రియను మెరుగుపర్చుకోవచ్చు. అలాగే గ్యాస్ సమస్య రాకుండా చేయొచ్చు. నోటి దుర్వాసనను తగ్గించుకోవచ్చ. ఇందుకోసం వామును మనం ఎన్నో విధాలుగా ఉపయోగించొచ్చు. వామును ఏ విధంగా ఉపయోగిస్తే జీర్ణ సమస్యలు తగ్గిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
గ్యాస్, నోటి దుర్వాసనను తగ్గించడానికి వామును ఎలా ఉపయోగించాలి?
వామును గ్యాస్, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం పొందడానికి ఎన్నో విధాలుగా ఉపయోగించొచ్చు. మీరు భోజనం చేసిన తర్వాత వామును లైట్ గా వేయించి నల్ల ఉప్పుతో కలిపి గోరువెచ్చని నీళ్లతో తీసుకోవచ్చు. లేదా మీరు వాము టీని తయారుచేసి కూడా తాగొచ్చు. ఇందుకోసం వామును నీటిలో మరిగించి టీ లా తాగాలి.
వామును మీరు వంటల్లో కూడా ఉపయోగించొచ్చు. అలాగే పిండిలో కలిపి రొట్టె చేసుకుని తినొచ్చు. వామును ఇలా తీసుకున్న గ్యాస్ సమస్య తగ్గిపోతుంది. అంతేకాదు మీరు వామును అన్నంతో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇది కడుపులో గ్యాస్ ను చాలా వరకు తగ్గిస్తుంది. అలాగే నోటి నుంచి వచ్చే దుర్వాసన రాకుండా చేయడానికి సహాయపడుతుంది.
వాములోలో యాంటీ స్పాస్మోడిక్, కార్మినేటివ్ లక్షణాలుంటాయి. ఇవి గ్యాస్, ఎసిడిటీ సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. వామును తినడం వల్ల గ్యాస్, అజీర్ణం, జీర్ణక్రియకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తగ్గిపోతాయి. మీకు తిన్న వెంటనే కడుపు ఉబ్బినట్టుగా అనిపిస్తే వెంటనే వామును కొంచెం తీసుకోండి. వెంటనే ఉబ్బరం తగ్గుతుంది.
వాములో యాంటీమైక్రోబయల్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాదు వాము మలబద్దకం సమస్యను తగ్గించడానికి కూడా బాగా సహాయపడుతుంది. కడుపును సులువుగా క్లీన్ చేస్తుంది. వాము తిన్న తర్వాత కూడా ఉదర సంబంధిత సమస్యలు తగ్గకపోతే మీరు ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లాలి.