తిన్న తర్వాత నడిస్తే మంచిదేనా? అతిగా నడిచారో మీ పని అంతే..!
ప్రస్తుతం చాలా మంది ఫిట్నెస్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి హెల్తీ ఫుడ్ ను తినడంతో పాటుగా రెగ్యులర్ గా వ్యాయామం కూడా చేస్తున్నారు. అయితే చాలా మంది తిన్న తర్వాత కాసేపైనా నడుస్తుంటారు. కానీ తిన్న తర్వాత అతిగా నడిస్తే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
walking
మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాలను ఖచ్చితంగా తినాలి. అలాగే రోజూ శారీరక శ్రమ చేయాలి. కాగా ప్రస్తుతం చాలా మంది ఫిట్ గా ఉండటానికి ఎన్నో ప్రయత్నాలను చేస్తున్నారు. కొంతమంది రోజూ జిమ్ కు వెళితే ఇంకొంతమంది వాకింగ్ చేస్తుంటారు. నిజానికి నడక మనల్ని ఎన్నో రోగాల ముప్పు నుంచి కాపాడుతుంది. అందుకే రోజూ కాసేపైనా ఖచ్చితంగా నడవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. నడక మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుందని ఎన్నో అధ్యయనాలు కూడా నిరూపించాయి.
walking
నడక మన శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. రోజూ నడవడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. కండర ద్రవ్యరాశి అభివృద్ధి చెందుతుంది. గుండె ఫిట్ గా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. ఇంతేకాదు నడక మనకు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది.
ఎప్పుడు నడవొచ్చు?
నడక మన దైనందిన జీవితంలో ఒక భాగం కావాలని నిపుణులు చెబుతున్నారు. మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచడానికి ప్రతిరోజూ 30 నుంచి 40 నిమిషాలు నడవొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే మీరు ఉదయం లేచిన వెంటనే వాకింగ్ కు వెళ్లొచ్చు. అలాగే భోజనం చేసిన తర్వాత కూడా నడవొచ్చు. ఇలా తిన్న తర్వాత నడిస్తే మీ జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. అలాగే మీ రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. చాలా మంది ఒత్తిడికి గురైనప్పుడు నడవడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. ఎందుకంటే నడక మీ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది.
తిన్న తర్వాత నడవడం మంచిదేనా?
నిజానికి తిన్న తర్వాత నడవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారని నిపుణులు అంటున్నారు. భోజనం తర్వాత కాసేపు నడవడం వల్ల మీ కడుపు, ప్రేగులకు రక్త ప్రవాహం పెరుగుతుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ ఫాస్ట్ గా పనిచేస్తూ కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ఈ సమస్య రాకుండా చేస్తుంది. అంతేకాదు ఇన్సులిన్ సున్నితత్వం, గ్లూకోజ్ జీవక్రియను పెంచుతుంది. దీంతో మీ రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. తిన్న తర్వాత నడక డయాబెటీస్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుంది.
నడక ఎంత వరకు కరెక్ట్?
మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వారంలో చాలా రోజులు సుమారు 30 నిమిషాలైనా మితమైన-తీవ్రత ఏరోబిక్ కార్యకలాపాల్లో పాల్గొనాలని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు. అంటే వేగంగా నడవాలని అర్థం. అంటే మీరు ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ సుమారు 30 నిమిషాల పాటు నడవాలి. ఇది ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. మీరు బరువు తగ్గాలనుకున్నా, మీ గుండెను ఫిట్ గా ఉంచాలనుకున్నా మీ నడక సమయాన్ని పెంచాల్సి ఉంటుంది.
అతిగా నడవడం వల్ల నష్టమేంటి?
నడక వల్ల కలిగే ప్రమాదాలు చాలా తక్కువ. ఇది సురక్షితమైన వ్యాయామం కూడా. అయినప్పటికీ మరీ ఎక్కువ దూరం నడవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎక్కువ నడక షిన్ బోన్ బెణుకు, ఒత్తిడి, పగుళ్లు లేదా స్నాయువు శోథతో సహా ఇతర సమస్యలు వస్తాయి.
సరైన బూట్లు లేకుండా లేదా ఎగుడు దిగుడుగా ఉన్న నేలపై నడవడం వల్ల కీళ్లు, ముఖ్యంగా మోకాళ్లు, తుంటిలో నొప్పి వస్తుంది. అవి బాగా అలసిపోతాయి. ఇది మీ మొత్తం కదలికను ప్రభావితం చేస్తుంది. అందుకే ఇలాంటి సమస్యలు రావొద్దదంటే నడక వ్యవధి, వేగం మధ్య సమతుల్యతను పాటించడం చాలా ముఖ్యం.