MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Health Tips: వర్షాకాలంలో పానీపూరి తింటున్నారా.. అయితే ఈ రోగాలు కొని తెచ్చుకున్నట్టే?

Health Tips: వర్షాకాలంలో పానీపూరి తింటున్నారా.. అయితే ఈ రోగాలు కొని తెచ్చుకున్నట్టే?

Health Tips: మామూలుగానే మనం రోడ్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తింటూ ఉంటాం. అందులో వర్షాకాలం అనేసరికి వేడివేడిగా పానీపూరి తినటానికి ఇష్టపడతాం. అది ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా కూడా తింటాం. అయితే అలా తినటం వల్ల నష్టాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

1 Min read
Author : Navya G
Published : Aug 19 2023, 01:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినే వాటిల్లో పానీ పూరి ఒకటి. రోడ్డుకు పక్కన పానీ పూరి బండి కనిపిస్తే చాలు టక్కమని ఆగిపోతాము. ఆ పక్కన ఉన్న పరిసరాలు గాని ఆ బండి గానీ నీట్ గా ఉన్నాయా లేవా అని కూడా చూసుకోకుండా ప్లేట్ల మీద ప్లేట్లు పానీ పూరి లాగించేస్తాము.
 

26

అయితే అలా తినటం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదం. అందులోనీ వర్షాకాలం, శీతాకాలం సీజన్లో వీటిని తింటే మరింత ప్రమాదం. ఎందుకంటే ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాపించే సీజన్ అది. పానీపూరి వల్ల టైఫాయిడ్ వచ్చే ప్రమాదం ఉండటమే కాకుండా ఇంకా అనేక ఇతర వ్యాధులు..

36

 వచ్చే ప్రమాదం ఉందని అనేకమంది వైద్యులు పేర్కొన్నారు. పానీ పూరీలు తీసుకోవడం వలన విరోచనాలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. అలాగే డిహైడ్రేషన్ కూడా ఎక్కువగా వస్తుంది. వీటితో పాటు అల్సర్, ప్రేగులలో మంట కూడా పానీపూరి తినటం వలన వస్తుంది.
 

46

అలాగే జీర్ణక్రియలో ఆటంకాలు కూడా ఏర్పడతాయి. అలాగే పానీపూరి తినటం వలన టైఫాయిడ్ చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందని వైద్యాధికారులు  ప్రకటించిన సంగతి తెలిసిందే. కాబట్టి వర్షాకాలంలో రోడ్డు పక్కన పానీ పూరి యే కాదు..

56

మరి ఏ ఇతర ఫుడ్ కూడా తీసుకోకుండా ఉండటం చాలా మంచిది. ఎందుకంటే వర్షాకాలంలో రోడ్డు పక్కన పానీపూరి బండి చుట్టుపక్కల పరిసరాలు నీటి చెమ్మలతో నిండి ఉంటాయి. ఆ నీటి చెమ్మలలో దోమలు పెరుగుతాయని విషయం మనందరికీ తెలిసిందే.
 

66

కాబట్టి తినాలనిపిస్తే చక్కగా ఇంట్లోనే చేసుకొని తినండి. దీనివలన ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి రెండు కలిసి వస్తాయి. లేదూ.. మురికి నీటితో కలిపిన పానీ పూరియే టేస్ట్ గా ఉంటుందనుకొని బయట తిన్నారంటే హాస్పిటల్ పాలు అవ్వటం తప్పనిసరి అవుతుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Beer: బీర్ తాగితే మ‌నిషి చ‌నిపోతాడా.? ఒకేసారి ఎంత తాగితే ఇలా జ‌రుగుతుందో తెలుసా.
Recommended image2
Sleep Habits: ఈ అలవాట్లు మీ నిద్రను పాడుచేస్తాయి.. జాగ్రత్త!
Recommended image3
Carrot Benefits: రోజుకో క్యారెట్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved