Health tips: పదే పదే దాహం వేస్తోందా? అయితే ఈ జబ్బు ఉందేమో చెక్ చేసుకోండి!
నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి సరిపడా నీళ్లు తాగితే సగం ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయని చెబుతుంటారు డాక్టర్లు. కానీ ఎక్కువగా నీళ్లు తాగడం, పదే పదే దాహం వేయడం ఒంట్లో ఏదో జబ్బుందని చెప్పే సంకేతమట. ఎక్కువ దాహం అయితే ఏ జబ్బులున్నట్లో ఇక్కడ తెలుసుకుందాం.

నీళ్లు శరీరానికి చాలా అవసరం. అందుకే రోజుకి 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగాలని నిపుణులు సలహా ఇస్తుంటారు. కానీ అంత నీళ్లు తాగడం నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా? నిజం చెప్పాలంటే, మన శరీర అవసరాలకు తగ్గట్టుగా మనం నీళ్లు తాగాలి. మన శరీరానికి ఎంత నీరు కావాలో మూత్రం రంగును బట్టి తెలుసుకోవచ్చు.
పదే పదే దాహం వేస్తే?
మీకు తరచుగా ఎక్కువగా దాహం వేస్తుంటే, అది శరీరంలో ఏదో సమస్య ఉందని సూచిస్తుంది. ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం. నిరంతరం ఎక్కువగా దాహం వేయడం మంచి సంకేతం కాదు. మీకు రోజంతా దాహం వేస్తుంటే, అది ప్రమాదకరమైన జబ్బుల సంకేతం కావచ్చు.
పాలిడిప్సియా
చాలా నీళ్లు తాగినా మీకు పదే పదే దాహం వేస్తుంటే, అది మంచి సంకేతం కాదు. మీకు పాలిడిప్సియా అనే ఆరోగ్య సమస్య ఉండవచ్చు. ఎక్కువగా దాహం కావడం, ఎక్కువ చెమటలు పట్టడం, డీహైడ్రేషన్ లాంటి సమస్యలు వస్తాయి. శరీరంలో కెఫీన్, ఆల్కహాల్ లేదా ఉప్పు ఎక్కువైనప్పుడు ఇది వస్తుంది.
షుగర్ పేషెంట్లకు?
మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవాళ్లకు కూడా ఎక్కువ దాహం వేస్తుంది. షుగర్ వస్తే శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యే ప్రక్రియ నెమ్మదిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. షుగర్ పేషెంట్లకు ఎక్కువగా దాహాం వేస్తుందని ఓ పరిశోధనలో తేలింది. కాబట్టి పదే పదే దాహం వేసినప్పుడు డాక్టర్‌ను కలవడం చాలా ముఖ్యం.
గుండె జబ్బులు
ఎక్కువగా దాహం వేసేవాళ్లకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అధిక రక్తపోటు లేదా హార్ట్ ఫెయిల్యూర్ లాంటి సమస్యల సమయంలో ఎక్కువగా దాహం వేయడం సాధారణం. ఎప్పుడైనా మీకు ఎక్కువగా దాహం వేస్తే, వెంటనే డాక్టర్‌ను కలవండి.
సెప్సిస్
సెప్సిస్ అనేది బ్యాక్టీరియా, ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల శరీరంలో మంట పెరగడం మొదలయ్యే పరిస్థితి. ఈ పరిస్థితిలో, వ్యక్తికి తీవ్రమైన దాహం కూడా వేస్తుంది.
గర్భిణులు
గర్భిణులకు సాధారణంగా ఇతరులకంటే ఎక్కువ దాహం వేస్తుంది. అలాంటి సందర్భాల్లో ఈ సమస్యను డాక్టర్‌తో పంచుకోవడం ముఖ్యం. ఓ పరిశోధన ప్రకారం రోజుకి దాదాపు 4-5 లీటర్ల నీళ్లు తాగాలి. అయితే, చాలా నీళ్లు తాగినా మీకు దాహం వేస్తుంటే, అది ప్రమాదం కలిగించే కొన్ని రోగాల సంకేతం కావచ్చు.