Health Tips: మీ మూత్రం రంగు మారుతుందా.. జాగ్రత్త, ఇది మీకు శరీరం పంపించే డేంజర్ బెల్!
HealthTips: మూత్రం సాధారణంగా వచ్చే రంగులో కాకుండా మరొక రంగులో వస్తున్నట్లయితే మీరు అనారోగ్యం పాలు అవుతున్నట్లు మీ శరీరం పంపిస్తున్న సంకేతం అది. మీరు గమనించి జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. అయితే ఏ రంగులో ఉండే మూత్రం ఏ ప్రమాదాన్ని సూచిస్తుందో ఇప్పుడు చూద్దాం.
స్పష్టంగా ఎలాంటి రంగు లేకుండా నీళ్ళలాగా మూత్రం వస్తుందంటే మీరు అతిగా నీరు తాగుతున్నారని అర్థం. ఇది రక్తంలోని ఎలక్ట్రోలైట్స్ అసమతుల్యతల్ని సూచిస్తుంది. కాబట్టి ఎక్కువగా తాగకుండా తగినంత నీరు తాగండి. అలాగే లేత నారింజ రంగు మూత్రం ఆ వ్యక్తి కొంచెం నిర్జలీకరణకి గురయ్యాడని అర్థం.
కాబట్టి వారు ఆరోగ్యకరమైన కొన్ని లిక్విడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. రీబోఫ్లావిన్ వంటి కొన్ని విటమిన్స్, సప్లిమెంట్స్ తీసుకోవడం వలన కూడా మూత్రం పసుపు లేదా నారింజ రంగులోకి మారుతుంది. కాబట్టి గమనించి ఒక నిర్ధారణకి రండి.
అయితే లేత పసుపు రంగులో మూత్రం ఉంటే ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడని అర్థం. తగినంత నీరు తాగి హైడ్రేటెడ్ గా ఉన్నవారు మాత్రం ఇలా లేతపసుపు రంగులో ఉంటుంది. అయితే ముదురు పసుపు రంగు మాత్రం తీవ్ర నిర్జలీకరణకి గురయ్యారని అర్థం.
ఇటువంటి వారు నీరు ఎక్కువగా తాగమని శరీరం పంపిస్తున్న సందేశం అది. కాబట్టి గుర్తించి తగిన చర్యలు తీసుకోండి. అలాగే పింక్ లేదా ఎరుపు రంగులో మూత్రం వస్తే మాత్రం డేంజర్. ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, ప్రొస్టేట్ ఇన్ఫెక్షన్ లేదా కిడ్నీ స్టోన్స్ వల్ల సంభవించవచ్చు.
కొన్ని సందర్భాలలో మూత్రపిండాలు వ్యాధి లేదా క్యాన్సర్ కి సంకేతం కావచ్చు. కాబట్టి త్వరగా వైద్య సలహా పొందటం అవసరమైన స్థితి ఇది. అలాగే ముదురు గోధుమ రంగు లేదా నలుపు రంగులో మూత్రం వస్తున్నట్లయితే కాలేయ సమస్యకు సంకేతం కావచ్చు.
అలాగే ముదురు నారింజ రంగులో మూత్రం వస్తున్నట్లయితే తీవ్రమైన వేడి వాతావరణం లో ఉండటం వలన లేదంటే తీవ్రమైన వ్యాయామం చేయడం వలన ఇలా జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలపై కొంచెం జాగ్రత్త వహించండి.