ఎండాకాలంలో బ్లాక్ టీ, మిల్క్ టీలను తాగుతున్నారా? అయితే జాగ్రత్త..
బ్లాక్ టీ, కాఫీ, మిల్క్ లను ఎండాకాలంలో తాగకపోవడమే మంచిది. ఎందుకంటే ఇవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. పలు పరిశోధనల ప్రకారం.. కొన్ని మూలికా టీలు కూలింగ్ ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచడానికి సహాయపడతాయి.

Moringa Tea
వేసవి వచ్చేసింది. మండుతున్న ఎండల వల్ల మనలో చాలా మందికి చెమటలు ఎక్కువగా పడుతుంటాయి. వేడి కారణంగా కొంతమంది జీర్ణ ప్రక్రియ కూడా ప్రభావితం అవుతుంది. అయితే మిల్క్ టీ లేదా బ్లాక్ టీ ను ఈ సీజన్ తాగకూడదు. ఎందుకంటే ఇవి ఎక్కువ చెమటను కలిగించడమే కాకుండా.. జీర్ణవ్యవస్థను కూడా దెబ్బతీస్తాయి. బాడీని చల్లగా ఉంచడానికి ఐస్ క్రీం లేదా కూల్ డ్రింక్స్ ను కూడా తాగకూడదు. ఎందుకంటే ఇవి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. నిపుణుల ప్రకారం.. కొన్ని హెర్బల్ టీలు మన శరీరాన్ని చల్లగా ఉంచడమే కాదు.. ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి. అవేంటంటే..
<p>herbal tea</p>
లెమన్ గ్రాస్ టీ
యునైటెడ్ స్టేట్స్ నేషనల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ప్రకారం.. నిమ్మగడ్డిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది శరీరాన్ని తేమగా, ఆక్సిజనేట్ చేస్తుంది. ఇది శరీర శక్తిని సమతుల్యం చేస్తుంది కూడా. అలాగే ఎండాకాలంలో రిఫ్రెష్ అనుభూతిని కలిగిస్తుంది. ఒక కప్పు లెమన్ గ్రాస్ టీ తాగితే కడుపునొప్పి, కడుపు తిమ్మిరి, జీర్ణ సమస్యలు తొందరగా తగ్గిపోతాయి.
ఫెన్నెల్ టీ
జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రకారం.. శరీర వేడిని తగ్గించడానికి సోంపు కూడా సహాయపడుతుంది. దీనిలో శీతలీకరణ లక్షణాలు ఉంటాయి. ఇలాంటి సోంపు ఎండాకాలంలో మనకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది.ఇది వేడి కారణంగా శరీరంలో మంటను తగ్గిస్తుంది. ఇది జీవక్రియను ఉత్తేజితం చేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థకు కూడా ఉపయోగపడుతుంది.
పుదీనా టీ
నిపుణుల ప్రకారం.. పుదీనాలో మెంతోల్ ఉంటుంది. ఇది నోట్లో ఫ్రెష్ నెస్ ను, చల్లదనాన్ని కలిగిస్తుది. వాతావరణంలోని మార్పుల వల్ల ముక్కు మూసుకుపోతుంది. అయితే పుదీనా టీ ముక్కును తెరుస్తుంది. పుదీనా జీర్ణవ్యవస్థ సమస్యలను, విరేచనాలు, మలబద్ధకం వంటి జీర్ణశయాంతర లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పుదీనా టీ వాంతులను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. పుదీనా నోటి దుర్వాసను పోగొట్టడంతో పాటుగా ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది.
మందారం టీ
జర్నల్ ఆఫ్ ఫైటోథెరపీ రీసెర్చ్ ప్రకారం.. మందారలో ఆంథోసైనిన్ యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది ఘాటైన రుచి, పుల్లని రుచిని కలిగి ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను హైడ్రేట్ చేస్తుంది. ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను కూడా ఈ మందారం టీ తగ్గిస్తుంది. ఈ టీ మన శరీరంలో వేడిని ఉత్పత్తి చేసే అడ్డంకులను తొలగిస్తుంది. ఇది సిస్టోలిక్, డయాస్టొలిక్ రక్తపోటును తగ్గిస్తుంది. జీవక్రియను సక్రియం చేస్తుంది. ఇది బ్లడ్ లిపిడ్స్ ను మెరుగుపరిచి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
rose tea
రోజ్ టీ
ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఆయుర్వేద రీసెర్చ్ ప్రకారం.. రోజ్ టీ సమతుల్యత, శీతలీకరణ, ఓదార్పు ప్రభావాలను కలిగి ఉంటుంది. సాంప్రదాయ చైనీస్ మెడిసిన్ లో కూడా రోజ్ టీని ఉపయోగిస్తారు.