Health Tips: రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు మీ కోసమే?
Health Tips: ముందు తరం లో కన్నా ఈ తరం మహిళలు ఎక్కువగా రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్నారు. వీరిలో చాలామంది వ్యాధి ముదిరిపోయిన వరకు వ్యాధి ఉందని గుర్తించలేకపోతున్నారు. అందుకే మహిళలకి ఒక అవగాహన కోసం ఈ వ్యాసం.
నేటి తరంలో మహిళలు ఎక్కువగా ఇతర క్యాన్సర్ల కన్నా రొమ్ము క్యాన్సర్ తో ఎక్కువగా బాధపడుతున్నారు. 30 ఏళ్లు దాటిన వెంటనే స్త్రీలు తరచుగా రూమ్ క్యాన్సర్ ఆలోచనలతోనే సతమతమవుతున్నారు. రొమ్ము క్యాన్సర్ కణాల ఉనికి గురించి తెలుసుకోవటానికి ఆరాటపడుతున్నారు.
రుతుక్రమం చిన్నవయసులో ప్రారంభమైన మెనోపాజ్ ఆలస్యంగా వచ్చిన క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
ముందుగా ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి సమతుల్య ఆహారం తీసుకోవడం తప్పనిసరి పుట్టగొడుగులు దానిమ్మ బీన్స్ చిక్కుడు గింజలు బచ్చల కూర నిత్యం భోజనంలో ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి.
శారీరకంగా చురుకుగా ఉండటానికి ప్రయత్నించండి. శరీరాన్ని మనసుని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం తప్పనిసరిగా అరగంటకి తక్కువ కాకుండా వ్యాయామం చేయండి. అలాగే శరీర బరువుపై కూడా దృష్టి పెట్టండి. ఆరోగ్యకరమైన బరువు మహిళల్లో రూమ్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కానీ గుండె ఆరోగ్యానికి ఎముక మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. అందుకే ఆరోగ్యకరమైన బరువులు కాపాడుకోవడానికి డైట్ కంట్రోల్ తో పాటు యోగ, వ్యాయామం లాంటివి తప్పకుండా చేయండి. అలాగే కొన్ని రకాల మందులు తీసుకోవడం వలన సైడ్ ఎఫెక్ట్స్ గా కూడా రొమ్ము క్యాన్సర్ వస్తుంది. అలాగే కొన్ని రకాల మందులు హార్మోన్ పునఃస్థాపన చికిత్స రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి.
కాబట్టి మీకు ఎలాంటి అనుమానం కలిగిన వెంటనే డాక్టర్ తో మాట్లాడటానికి సిద్ధంగా ఉండండి ఈ విషయంలో సిగ్గుపడితే ప్రమాదాన్ని కోరి తెచ్చుకున్నట్టే. 40 సంవత్సరాల దాటిన ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి రొమ్ముని స్క్రీనింగ్ చేయించుకోండి. ఇలా స్క్రీనింగ్ చేయించుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించలేకపోయినప్పటికీ ప్రారంభ సంకేతాలని గుర్తించడంలో సహాయపడతాయి. ప్రారంభ దశలో ఉన్న క్యాన్సర్ ను ఎదుర్కోవటం సులభమని గుర్తించండి.