Health Tips: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మీ లివర్ ప్రమాదంలో పడినట్లే?
Health Tips: లివర్ అనేది శరీరంలో చాలా ముఖ్యమైన అంశం. అయితే ఆ లివర్ పాడైనప్పుడు శరీరంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయంట అవేంటో ముందుగానే తెలుసుకొని జాగ్రత్త పడదాం.
శరీరంలో లివర్ చాలా ముఖ్యమైనది. లివర్ ఫంక్షన్స్ సరిగా లేకపోతే ఆ ఎఫెక్ట్ బాడీ మొత్తం మీద పడుతుంది. లివర్ సమస్యలు ఉంటే మన శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి అంట. అవేమిటో ముందుగానే తెలుసుకుంటే సమస్యని అదుపులో ఉంచుకోవచ్చు అదేంటో చూద్దాం.
లివర్ సమస్యలు ఉన్నప్పుడు జీర్ణ క్రియలు సరిగ్గా ఉండవని నిపుణులు చెప్తున్నారు. ఏం తిన్నా అరగకపోవటం ఆకలి లేకపోవడం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉంటాయి. ఎప్పుడైనా ఇలాంటి సమస్య వస్తే ప్రమాదం లేదు కానీ తరచుగా వస్తే మాత్రం ఈ విషయంపై శ్రద్ధ పెట్టండి.
ఎందుకంటే లివర్ డ్యామేజీ అవుతున్నట్లుగా శరీరం మీకు పంపిస్తున్న సందేశం ఇది. అలాగే లివర్ సమస్య వచ్చినప్పుడు మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపుతుంది. దీనివలన యాంగ్జైటీ డిప్రెషన్ వంటివి తలెత్తుతాయి. మీకు రెగ్యులర్గా తలనొప్పి వస్తున్నట్లయితే ఆ లక్షణాన్ని కూడా నిర్లక్ష్యం చేయవద్దు అంటున్నారు నిపుణులు.
ఎందుకంటే లివర్ సమస్య ఉన్నప్పుడు తరచుగా తలనొప్పి మనల్ని బాధిస్తుందట. అలాగే మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉండటం కూడా కాలేయ సమస్యకి ఒక లక్షణమే ఎందుకంటే ఆర్థరైటిస్, కాలేయ సమస్యలకి సంబంధం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
అందుకే లివర్ సమస్య ఉన్నప్పుడు జాయింట్ పెయింట్స్ ఎక్కువగా వస్తాయట. ఇలాంటివారు ఎక్కువ దూరం నడిస్తే నొప్పి ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు కూడా ఖచ్చితంగా ముందు జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది. అలాగే సెంట్రల్ న్యూరో ట్రాన్స్మిషన్ మార్పుల కారణంగా అలసట ఏర్పడుతుంది.
a
లివర్ సమస్యలు ఉన్నవారిలో కచ్చితంగా అలసట ఎక్కువగా ఉంటుంది ఏ పని చేయాలనిపించకపోవడం నీరసంగా అనిపించడం ఒకవేళ పని చేసిన త్వరగా అలసిపోవడం వంటివి లివర్ డ్యామేజీ అయింది అని చెప్పటానికి సూచనలు కాబట్టి ముందుగా పసిగట్టి జాగ్రత్త పడండి.