MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • రోజుకు ఇన్ని లీటర్ల నీటిని తాగితే బరువు తగ్గడం పక్కా..

రోజుకు ఇన్ని లీటర్ల నీటిని తాగితే బరువు తగ్గడం పక్కా..

బరువు తగ్గాలంటే అన్నాన్ని తగ్గించడమే కాదు.. నీళ్లను పుష్కలంగా తాగాలంటారు నిపుణులు. అవును రోజూ కొన్ని లీటర్ల నీళ్లను తాగినా సులువుగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ బరువు తగ్గాలంటే రోజుకు ఎన్ని లీటర్ల నీటిని తాగాలంటే?

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Oct 07 2024, 10:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బరువు తగ్గడానికని ఒక్కొక్కరు ఒక్కో రకమైన డైట్ ను ఫాలో అవుతుంటారు. మరికొంతమంది అన్నాన్ని పూర్తిగా మానేసి కేవలం చపాతీ, రోటీలను మాత్రమే తింటుంటారు. అయినా బరువు తగ్గని వారు చాలా మంది ఉంటారు. నిజానికి ఇలా మీరు బరువు తగ్గకుండా ఉండటానికి ఒక కారణం ఉంది. అదే నీళ్లను తాగకపోవడం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25


నిపుణుల ప్రకారం.. మనం బరువు తగ్గడానికి నీళ్లు ఎంతగానో సహాయపడతాయి. ఒక అధ్యయనం ప్రకారం.. శారీరక శ్రమ, పండ్లు, కూరగాయలు మీ బరువును తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. వీటితో పాటుగా మీరు రోజూ నీళ్లను పుష్కలంగా తాగితే కూడా మరిన్ని ప్రయోజనాలను పొందుతారు. 

ఊబకాయమనేది ఒక ప్రధాన ఆరోగ్య సమస్య. ఈ సమస్య మీ ఆకలి, జీవక్రియతో సంబంధం కలిగి ఉంటుంది. దీనివల్ల టైప్ 2 డయాబెటీస్, గుండె సంబంధిత సమస్యలు. ఆర్థరైటిస్ తో పాటుగా కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది.

అందుకే ఊబకాయం చాలా డేంజర్ అంటారు. అయితే బరువు తగ్గాలనుకునే వారు మాత్రం నీళ్లను పుష్కలంగా తాగాలి. ఎందుకంటే నీళ్లు మీ బరువును తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. 
 

35

ఆకలి తగ్గడానికి నీరు తాగాలి

చాలా మందికి ఆకలికి, దాహానికి మధ్య తేడా తెలియదు. దాహం వేసినా.. ఆకలి అవుతుందని తినేవారు చాలా మంది ఉన్నారు. కానీ ఇలా తరచుగా తింటే మీ బరువు మరింత పెరిగే ప్రమాదం ఉంది.

మీకు తెలుసా? ఆకలి అయినప్పుడు నీళ్లను పుష్కలంగా తాగండి. అయినా ఆకలిగా అనిపిస్తే తినండి. కానీ ఇలా చేయడం వల్ల మీరు హెవీగా తినరు. లిమిట్ లో తింటారు. నీళ్లను తాగితే కడుపు చాలా వరకు నిండుతుంది. ఆకలి తగ్గుతుంది. ఇలా మీ బరువు అదుపులో ఉంటుంది. 

ఒక అధ్యయనం ప్రకారం.. ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లను తాగితే మీ శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అలాగే మీ మెటబాలిజం రేటు పెరుగుతుంది. ఇది మీ శరీరంలో ఎక్కువ కేలరీలను కరిగించడానికి సహాయపడుతుంది. 

మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోండి

నీళ్లు తాగితే మీ శరీరంలోని హానికరమైన విషపదార్థాలు బయటకు పోతాయి. నీళ్లు మీ జీర్ణవ్యవస్థను, కండరాల పనితీరును మెరుగుపరుస్తాయి. ఇందుకోసం మీరు ప్రతిరోజూ 10 గ్లాసుల వరకు నీళ్లను తాగడం అలవాటు చేసుకోవాలి.

ఈ అలవాటు మొదట్లో కాస్త కష్టంగా అనిపించినా.. కొన్ని రోజుల్లోనే అలవాటు అవుతుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి మీరు ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ఎక్కడికెళ్లినా వాటర్ బాటిల్ ను మీ వెంటే తీసుకెళ్లండి. 

45

కేలరీలు తీసుకోవడం తగ్గాలంటే మీరు నీళ్లను పుష్కలంగా తాగాలి. దీనివల్ల మీ ఆకలి తగ్గి చాలా వరకు బరువు తగ్గుతారు. పెరగకుండా ఉంటారు. అలాగని శీతల పానీయాలను తాగకూడదు. ఎందుకంటే వీటిలో చక్కెరతో పాటుగా ఇతర హానికరమైన పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.

దాహం తీరాలని వీటిని ఎక్కువగా తాగుతుంటారు. కానీ ఇవి మీ బరువు పెరిగేలా చేస్తాయి. అందుకే వీటిని తాగకండి. వీటికి బదులుగా కేలరీలు లేని టేస్టీ కొబ్బరి నీళ్లను తాగండి. 
 

55


తినడానికి ముందు నీళ్లు

తినడానికి ముందు నీళ్లను తాగితే మీరు చాలా వరకు హెవీగా తినరు. ఇదే మీరు బరువు తగ్గేలా చేస్తుంది. తగినన్ని నీళ్లను తాగడం, ఆహారాల్లో నీళ్లు ఉండటం వల్ల మీరు అనుకున్న బరువును తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. నీల్లు మీరు తినే మొత్తాన్ని చాలా వరకు తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది మీ మెటబాలిజాన్ని పెంచుతుంది. అందుకే నీళ్లు తాగడానికి అలారం ను సెట్ చేయండి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
ఎప్పుడూ ఒక‌వైపే న‌మిలి తింటున్నారా.? ఏం జ‌రుగుతుందో తెలిస్తే వెంట‌నే ఆపేస్తారు
Recommended image2
ట్యాబ్లెట్స్ కంటే ఇంజ‌క్ష‌న్‌తో త్వ‌ర‌గా రిలీఫ్ ఎందుకు వ‌స్తుంది? వెనుకున్న సైన్స్ ఏంటంటే?
Recommended image3
సిగరెట్ లేకుండా మల విసర్జన కావడం లేదా? కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved