మొటిమలు రావడానికి అసలు కారణం ఇదే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ముఖంపై మొటిమలు (Acne) రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇలా మొటిమలు ఏర్పడి వాటి తాలూకు మచ్చలు (Spots) శాశ్వతంగా ఉండిపోయి ముఖం అందవిహీనంగా తయారవుతుంది. అలాంటప్పుడు నలుగురిలో కలవడానికి కాస్త ఇబ్బందిగా భావిస్తారు. కనుక మొటిమలు రాకుండా ఉండాలంటే చర్మానికి ప్రత్యేక శ్రద్ద తప్పనిసరి. మరి మొటిమలు రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం..

pimples
కలుషిత వాతావరణం, తీసుకునే ఆహారంలో పోషకాల లోపం (Nutrient deficiency) ఇలా అనేక కారణాలతో చర్మ సమస్యలు ఏర్పడుతాయి. దీంతో చర్మం పొడిబారి తేమను కోల్పోతుంది. కనుక మనము చర్మ సౌందర్యం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నప్పుడే ముఖానికి మంచి నిగారింపు అందడంతో పాటు చర్మ ఆరోగ్యం (Skin health) కూడా మెరుగుపడుతుంది.
ముఖంపై మొటిమలు ఏర్పడడానికి ప్రధాన కారణం శరీరంలో నీటి శాతం (Percentage of water) తగ్గడమే. కనుక మన శరీరానికి తగిన మోతాదులో నీటిని అందిస్తే చర్మం తాజాగా ఉండడంతోపాటు చర్మంలో పేరుకుపోయిన మలినాలు (Impurities) కూడా బయటకు పోతాయి. చర్మ సమస్యలకు మరో ముఖ్య కారణం మనం వాడే సబ్బులు కొన్ని రకాల ఫేస్ వాష్ లు.
వీటిలో ఉండే అధిక మొత్తంలో రసాయనాలు ముఖాన్ని పొడిబారుస్తాయి. కనుక మన చర్మ తత్వానికి సరిపడు సబ్బులను (Soaps), ఫేస్ వాష్ (Face wash) లను ఎంచుకోవడం తప్పనిసరి. కనుక చర్మానికి తేమను అందించే రకపు సబ్బుల్ని ఎంచుకోవడం ఉత్తమం. మారుతున్న వాతావరణంలోని మార్పులు, కలుషిత వాతావరణం కారణంగా చర్మ రంధ్రాలలో మలినాలు చేరి మొటిమలకు దారితీస్తుంది.
కాబట్టి క్లెన్సింగ్ (Cleansing), స్క్రబ్బింగ్ (Scrubbing) లకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎక్కువ ఎండకు, చలిగాలిలో తిరిగిన చర్మానికి హాని కలుగుతుంది. కనుక ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు మాయిశ్చరైజింగ్ క్రీమ్ లను అప్లై చేసుకోవడం మంచిది. ఇవి చర్మానికి తేమను అందించి పొడిబారకుండా చూస్తాయి. చర్మ సమస్యలకు దూరంగా ఉంచుతాయి. అయితే చాలామంది నూనె ఆధారిత మాయిశ్చరైజింగ్ లను ఎంచుకుంటారు.
pimples
ఇది కూడా మొటిమలు రావడానికి ముఖ్య కారణమే. కనుక నీరు లేదా జెల్ ఆధారిత మాయిశ్చరైజింగ్ (Moisturizing) రకాలను ఎంచుకోవడం ఉత్తమం. చర్మానికి కొన్ని రకాల లేపనాలను వారానికి కనీసం రెండుసార్లు ప్రయత్నిస్తే చర్మానికి కావలసిన పోషకాలు (Nutrients) అంది చర్మం తాజాగా ఉంటుంది. మనం తీసుకునే ఆహారం కూడా ముఖంపై మొటిమలు రావడానికి ముఖ్య కారణం కావచ్చు.
pimples
కనుక తీసుకునే ఆహారంలో ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ (Oil foods), జంక్ ఫుడ్స్ (Junk Foods), ఫాస్ట్ ఫుడ్స్ లేకుండా చూసుకోవాలి. వీటి కారణంగా ముఖంపై మొటిమలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కనుక ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. రాత్రి పడుకునే ముందు వేసుకున్న మేకప్ ను పూర్తిగా తొలగించడం మాయిశ్చరైజింగ్ క్రీమ్ లను అప్లై చేసుకొని నిద్రించడం మంచిది.