వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావొద్దంటే ఇలా చేయండి
Monsoon Health: వర్షాకాలంలోని తేమ, తేమ వల్ల ఎన్నో రకాల చర్మ సమస్యలు వస్తుంటాయి. అంతేకాదు దగ్గు, జలుబు, సైనస్, మైగ్రేన్ వంటి సమస్యలు వస్తాయి. ఈ సీజన్ లో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మండుతున్న ఎండల నుంచి చల్లని చిరు గాలులు ఉపశమనాన్ని కలిగించాయి. వేడి వేడి టీ, పకోడీలు, మిరపకాయ బజ్జీలతో ఈ సీజన్ ను బలే ఎంజాయ్ చేస్తారు. కానీ ఈ సీజన్ ఎన్నో రోగాలను మూటగట్టుకుని వస్తుంది. గాలి, తేమ సూక్ష్మక్రిములు ఎన్నో రోగాలు వచ్చేలా చేస్తాయి. అందుకే వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి. ఇది అసౌకర్యంగా, బాధాకరంగా ఉంటుంది. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్లను తగ్గించుకోవడం అంత సులువు కాదు. మరి వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావొద్దంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
hand washing
వ్యక్తిగత పరిశుభ్రత
ఫంగస్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం చాలా చాలా అవసరం. ఇందుకోసం మీ చేతులను క్రమం తప్పకుండా యాంటీ ఫంగల్ సబ్బుతో కడగాలి. ముఖ్యంగా వర్షంలో నానిన తర్వాత. గోరు ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి మీ గోర్లను చిన్నగా కట్ చేసుకోవాలి.
సౌకర్యవంతమైన దుస్తులు
ఈ సీజన్ లో కాటన్ లేదా లినిన్ వంటి శ్వాసించదగిన, వదులుగా ఉండే సౌకర్యవంతమైన దుస్తులను వేసుకోవాలి. గాలి ప్రసరణకు అనుమతించడం ద్వారా, ఈ వస్త్రాలు మన చర్మాన్ని పొడిగా ఉంచుతాయి. ఫంగస్ నుంచి రక్షిస్తాయి.
తేమ
ఎక్కువ తేమ వల్ల చర్మంపై ఫంగస్ ఏర్పడుతుంది. అందుకే మీరు వర్షంలో తడిసిపోయినప్పుడు మిమ్మల్ని మీరు పూర్తిగా ఆరబెట్టుకోవాలి. రొమ్ముల క్రింద, కాలి మధ్య స్థలంతో సహా ఫంగస్ బారిన పడే ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
యాంటీ ఫంగల్ పౌడర్లు
చర్మం పొడిగా ఉండటానికి, ఫంగస్ ఏర్పడకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలను తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా ఎక్కువగా చెమట పట్టే ప్రాంతాలలో ఉన్నవారు. వీళ్లు క్లోట్రిమాజోల్ లేదా మైకోనజోల్ పౌడర్లను చెమట పట్టే ప్రాంతాలకు అప్లై చేయాలి.
హైడ్రేటెడ్ గా ఉండండి
ఎండాకాలంలోనే కాదు వానాకాలం, చలికాలంలో కూడా నీళ్లను పుష్కలంగా తాగాలి. ఎందుకంటే నీళ్లు మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే శరీరం నుంచి కాలుష్య కారకాలను తొలగించడానికకి సహాయపడుతాయి. అలాగే ఈ సీజన్ లో విటమిన్లు, ఖనిజాలతో నిండిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినండి. ఇది మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అలాగే ఫంగస్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.