దగ్గు, జలుబు తొందరగా తగ్గాలంటే ఇలా చేయండి
వానాకాలంలో వెదర్ చాలా చల్లగా ఉంటుంది. దీనివల్ల జలుబు, దగ్గు, తుమ్ములు వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో ఈ సమస్యలను తొందరగా తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటంటే..

ఆవిరిపట్టడం
జలుబు నుంచి ఉపశమనం పొందడానికి ఆవిరి పట్టడం ప్రభావవంతంగా ఉంటుంది. ఇది ముక్కు కారడాన్ని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. ఆవిరిపట్టేటప్పుడు ముక్కుతో నెమ్మదిగా శ్వాస తీసుకోండి. ఇది జలుబు నుంచి బయటపడటానికి సహాయపడుతుంది.
అల్లం తులసి
అల్లం, తులసి కలిపిన నీటిని తాగడం వల్ల దగ్గు, జలుబు నుంచి బయటపడతారు. అలాగే మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అల్లంలో జింజెరోల్స్, షోగోల్స్ అని పిలువబడే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.
తేనె
తేనెలో వివిధ రకాల యాంటీ బాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇది దగ్గు, జలుబును తగ్గించడానికి ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం టీ లో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే జలుబు, గొంతునొప్పి తగ్గుతాయి. దగ్గుకు తేనె చాలా ఎఫెక్టివ్ రెమెడీ.
తులసి ఆకులు, నల్ల మిరియాలు
తులసి ఆకులు, నల్ల మిరియాలతో చక్కటి కాఫీని తయారుచేయండి. ఈ టీని వేడిగానే తాగండి. ఈ టీ మీ దగ్గును, జలుబును ఇట్టే తగ్గిస్తుంది.
వెల్లుల్లి
వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనం అద్భుతమైన యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. మీకు జలుబు ఉన్నప్పుడు మీ ఆహారంలో అదనపు వెల్లుల్లిని చేర్చండి. ఇది జలుబు లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది.
మిరియాల పొడి కలిపిన పాలు
మరిగించిన పాలను వేడి చేసే ముందు అందులో కొద్దిగా మిరియాల పొడిని కలపండి.ఈ పాలు జలుబును తొందరగా తగ్గించడానికి సహాయపడుతుంది.
తులసి ఆకులు, కలబంద
తులసి ఆకులు, కలకందలను మిక్స్ చేసి మిక్స్ డ్ గా తింటే జలుబు నుంచి తొందరగా బయపడతారు.
Turmeric Milk
పసుపు పాలు
పాలలో పసుపు వేసి తాగడం చాలా మంచిది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పసుపులో ఉండే కర్కుమిన్ అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఊపిరితిత్తులను ప్రభావితం చేసే బ్యాక్టీరియా కలిగించే వ్యాధులు, వైరస్లకు వ్యతిరేకంగా పసుపు ప్రభావవంతంగా ఉంటుందని తేలింది.