బీపీని తగ్గించే చిట్కాలు మీకోసం..
అధిక రక్తపోటు గుండెపోటు, స్ట్రోక్, ధమనులలో రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుంది. ఉప్పును ఎక్కువగా తీసుకోవడం, ఒత్తిడి, ఊబకాయం, మద్యపానం, స్మోకింగ్ వంటివి రక్తపోటును పెంచుతాయి.

ఒకప్పుడు రక్తపోటు పెద్ద వయసు వారికే వచ్చేది. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. మీకు తెలుసా? ఈ రక్తపోటును సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. హై బీపీ గుండెపోటు, స్ట్రోక్, ధమనులలో రక్తం గడ్డకట్టడానికి దారితీస్తుంది. స్ట్రెస్, ఊబకాయం, ఉప్పును ఎక్కువగా తీసుకోవడం, ధూమపానం, మద్యపానం వంటివి రక్తపోటును పెంచుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే రక్తపోటును తగ్గించడానికి కొన్ని ఆహారాలు ఎంతో సహాయపడతాయి. అవేంటంటే..
అరటిపండ్లు
హై బీపీ పేషెంట్లకు అరటిపండ్లు ఎంతో మేలు చేస్తాయి. అరటిపండ్లలో ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది. ఒక మీడియం సైజు అరటిపండులో 422 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. పొటాషియం రక్త నాళాల గోడలో ఉద్రిక్తతను తగ్గిస్తుంది. అందుకే అరటిపండ్లను క్రమం తప్పకుండా తింటే అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
ఆకు కూరలు
ఆకుకూరల్లో ఉండే పోషకాలు అధిక రక్తపోటును నియంత్రించడానికి ఎంతో సహాయపడతాయి. ఆకు కూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు, నైట్రేట్లు, ఇనుము ఉంటాయి. ఇవి బీపీని తగ్గించడానికి సహాయపడతాయి. కాబట్టి పాలకూర, మునగాకు వంటి ఆకు కూరలను మీ ఆహారంలో చేర్చుకోండి.
high blood pressure
టమాటాలు
100 గ్రాముల టమోటాల్లో 237 మిల్లీగ్రాముల పొటాషియం కంటెంట్ ఉంటుంది. ఈ పొటాషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది. టమోటా జ్యూస్ తాగడం వల్ల అధిక రక్తపోటు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
high blood pressure
దానిమ్మ పండ్లు
దానిమ్మ పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే దానిమ్మ బీపీని నియంత్రించి.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
బీట్ రూట్
బీట్ రూట్ లో నైట్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది రక్త నాళాలను సడలించడానికి, రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
అవొకాడో
అవొకాడో బీపీ పేషెంట్లకు మంచి మేలు చేస్తుంది. అవొకాడోల్లో పొటాషియం, ఫోలేట్ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని రక్షించడానికి సహాయపడతాయి.
వెల్లుల్లి
వెల్లుల్లిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగుంటాయి. వెల్లుల్లి రక్త నాళాలను విస్తరించే నైట్రిక్ ఆక్సైడ్ మొత్తాన్ని పెంచడానికి సహాయపడుతుంది.
అల్లం
మీ రోజువారీ ఆహారంలో అల్లాన్ని చేర్చడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదం కూడా తప్పుతుంది.
సాల్మన్ ఫిస్
ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్న సాల్మన్ ఫిష్ అధిక రక్తపోటు పేషెంట్లకు ఎంతో సహాయపడుతుంది. దీనిలో ఉండే ఒమేగా కొవ్వులు ఆరోగ్యకరమైన కొవ్వులుగా పరిగణించబడతాయి. ఇవి రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయి.
బెర్రీలు
యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే బెర్రీలు అధిక రక్తపోటును నియంత్రించడానికి కూడా సహాయపడతాయి.