MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • మందులు లేకుండా మధుమేహాన్ని తగ్గించుకునే చిట్కాలు మీకోసం..!

మందులు లేకుండా మధుమేహాన్ని తగ్గించుకునే చిట్కాలు మీకోసం..!


డయాబెటీస్ ఒక జీవనశైలి వ్యాధి. దీన్ని పూర్తిగా తగ్గించే చికిత్స లేదు. ఈ రోగాన్ని కేవలం నియంత్రించగలం అంతే. చిన్న వ్యాధే కదా అని నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యం ఎంతో దెబ్బతింటుంది.
 

R Shivallela | Updated : Oct 27 2023, 07:15 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
diabetes

diabetes

ప్రపంచ వ్యాప్తంగా డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీనికి కారణం సరిగ్గా లేని జీవనశైలేనంటున్నారు నిపుణులు. ఈ వ్యాధి వచ్చిన చాలా మంది జీవితాంతం ప్రతిరోజూ ఇన్సులిన్ లేదా మాత్రలు తీసుకుని దీన్ని నియంత్రిస్తారు. జీవితకాలం మందులను వాడితే ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంది. అయితే మందులతోనే కాకుండా కొన్ని అలవాట్లతో కూడా మధుమేహాన్ని నియంత్రిచొచ్చంటున్నారు నిపుణులు. కొన్ని అధ్యయనాలు డయాబెటిస్ ను మందులు లేకుండా కూడా నియంత్రించొచ్చని సూచిస్తున్నాయి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. 

26
Asianet Image

'కట్ ది షుగర్': షుగర్ పేషెంట్లు ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. తీపి పదార్థాలు టేస్టీగా ఉన్నా.. ఇవి ఎన్నో రోగాలకు దారితీస్తాయి. మధుమేహులు చక్కెరను ఎక్కువగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. చక్కెరను పూర్తిగా మానేస్తే టైప్ 2 డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. ఐస్ క్రీం, బిస్కెట్లు, కేకుల్లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. మధుమేహులకు వైట్ రైస్ కూడా అంత మంచిది కాదు. 

36
Asianet Image

వ్యాయామం చేయకుండా ఉండేవారు  చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారు వైట్ బ్రెడ్, వైట్ వైట్ రైస్, వైట్ ఇడ్లీలు వంటివి ఆహారాలను ఎక్కువగా తీసుకోకూడదు. వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ మధుమేహులకు చాలా మంచిది. ఇది వీళ్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. బియ్యాన్ని పూర్తిగా మానేయడం కష్టమైతే.. ఒక ప్లేట్ తీసుకుని దాన్ని నాలుగు భాగాలుగా గీతలు గీయండి. వీటిలోఅన్నం ఒక భాగంలో , గుడ్డు, కాయధాన్యాలు లేదా చేపను పెట్టండి. మిగతా భాగాల్లో కూరగాయలు, పండ్లను చేర్చండి. ఇలా చేస్తే మీ మధుమేహం నియంత్రణలో ఉంటుంది. 
 

46
Asianet Image

మీకు తెలుసా? డయాబెటీస్ వల్ల నేడు ఎన్నో రకాల వ్యాధులు సంక్రమిస్తున్నాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డయాబెటీస్ కంట్రోల్ లో లేకపోతే కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. 
 

56
diabetes diet

diabetes diet

డయాబెటీస్ ఉన్నవారు ఖచ్చితంగా రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి. కండరాలను పెంచుకోవాలి. 14 గంటల ఉపవాసం ఉండటం, హెల్తీ ఫుడ్ ను తినడం వల్ల మధుమేహాన్ని నియంత్రించొచ్చంటున్నారు నిపుణులు. రోజుకు రెండు పూటలా మాత్రమే భోజనం చేయాలి. ఎనిమిది గంటల్లో రోజుకు రెండుసార్లు మాత్రమే తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

66
Asianet Image

మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలంటే మీ శరీరంలో విటమిన్ డి పుష్కలంగా ఉండాలి. నిపుణుల ప్రకారం.. విటమిన్ డి లోపం ఉన్నవారికి డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. సూర్యరశ్మికి ఉండని వారు విటమిన్ డి మాత్రలను వేసుకుంటే సరిపోతుంది. అలాగే డయాబెటీస్ పేషెంట్లు రోజుకు ఏడెనిమిది గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. ఇలా నిద్రపోకుంటే కూడా డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒత్తిడిని తగ్గిస్తే కూడా మధుమేహం నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

R Shivallela
About the Author
R Shivallela
ఆరోగ్యం
 
Recommended Stories
Top Stories