వర్షాకాలంలో గుండె జబ్బుల ముప్పు ఎక్కువ.. ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి
మారుతున్న వాతావరణం ప్రభావం మన మనసు, శరీరం రెండింటిపైనా ఉంటుందంటున్నారు నిపుణులు. కాగా ఈ రెండూ మన గుండె ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి. కాబట్టి వర్షాకాలంలో గుండెను ఆరోగ్యంగా ఉంచడం కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

heart health
మారుతున్న వాతావరణం కూడా మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ సీజన్ లో తరచుగా వానలు పడుతూనే ఉంటాయి. ఇది ఆహ్లాదంగా అనిపిస్తుంది. కానీ వాతావరణం మారినప్పుడు ఎన్నో రోగాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గుండెజబ్బులు. చల్లని వాతావరణం గుండెకు ప్రమాద కారకమన్న సంగతి మీకు తెలుసా?
heart
జామా జర్నల్ లో కార్డియాలజీ ఆధారంగా ఒక అధ్యయనం జరిగింది. ఇందులో స్వీడన్ లో గుండె సమస్యలతో బాధపడుతున్న 275000 మందిపై అధ్యయనం చేశారు. ఇది ప్రధానంగా గుండెపై వాతావరణ ప్రభావాన్ని పరిశీలించింది. ఇందుకోసం 1998 నుంచి 2013 వరకు 15 ఏళ్ల కాలపరిమితిని కవర్ చేశారు. వాతావరణంలో హెచ్చుతగ్గులు కూడా గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని డేటాను లోతుగా పరిశీలిస్తే తెలిసింది. ఏదేమైనా సీజనల్ మార్పుల ప్రభావం 70 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
world heart day
సూర్యరశ్మి లేకపోవడం
సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరినప్పుడు గుండెపోటు రేటు తగ్గింది. కానీ తక్కువ వాతావరణ పీడనం, దానికి అనుబంధంగా గాలి, వర్షం, సూర్యరశ్మి లేకపోవడం కూడా గుండెపోటుకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. వాతావరణం చాలా త్వరగా మారినప్పుడు గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఎందుకంటే మన శరీరం వాతావరణానికి ఫాస్ట్ గా అలవాటు పడలేకపోతుంది.
heart health
సమతుల్య ఆహారం, సరైన జీవనశైలి
జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనం ప్రకారం.. ఆసియా దేశాలలో కూడా వేడి, తేమతో కూడిన వర్షాకాలం ఉంటుంది. బ్యాక్టీరియా, వ్యాధికారక క్రిములు వృద్ధి చెందడానికి ఈ సీజన్ చాలా అనువైనది. దీనివల్ల ఈ సీజన్ లో జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. అంతేకాదు వర్షాకాలంలో నీటి ద్వారా వచ్చే వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. దీనిని నివారించడానికి మంచి జీవనశైలితో పాటుగా సమతుల్య ఆహారాన్ని కూడా తీసుకోవాలి. ఇది గుండె సమస్యలను నివారిస్తుంది. వానాకాలంలో గుండెను ఆరోగ్యంగా ఉంచే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
heart
ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఆహారాన్ని తినకండి
ఎండాకాలంలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఇది మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. కానీ వర్షాకాలంలో పరిస్థితులు మారిపోతాయి. టమోటాలు, దోసకాయలు, పుచ్చకాయ వంటి ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి శరీరంలో మంటను కలిగిస్తాయి. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా ఉండాలంటే చింతపండు, నిమ్మకాయలకు కూడా దూరంగా ఉండాలి.
heart health
ఉప్పును తగ్గించాలి
వర్షాకాలంలో ఫ్రైడ్ ఫుడ్స్, స్ట్రీట్ ఫుడ్స్ ను తినే వారు ఎక్కువే. ఎందుకంటే ఇవి వేడిగా, టేస్టీగా అనిపిస్తాయి. కానీ ఈ ఆహారాలన్నింటిలో ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. ఉప్పును ఎక్కువగా తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సోడియం, సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి.
పాల ఉత్పత్తులను మితంగా తినండి
ఏ సీజన్ అయినా సరే ఎక్కువ కొవ్వు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. వర్షాకాలంలో రుచికరమైన మిల్క్ షేక్ లేదా మజ్జిగను ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే వీటిని తీసుకుంటే నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల బారినపడతారు.
సీజనల్ ఫ్రూట్
సీజనల్ ఫ్రూట్స్ లో న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉంటాయి. క్రాన్బెర్రీలు, చెర్రీలు, పియర్స్, డ్రాగన్ ఫ్రూట్ వంటి సీజనల్ ఫ్రూట్స్ ను ఖచ్చితంగా తినండి. మీరు తినే ఆహారంలో పీచు, నీటి పరిమాణం ఎక్కువగా ఉండాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే అరటిపండ్లు, బొప్పాయిని కూడా తినొచ్చు.