థైరాయిడ్ ఉన్నవారు ఏం తినాలి? ఏం తినకూడదు?
హై బీపీ పేషెంట్లే కాదు.. థైరాయిడ్ పేషెంట్లు కూడా ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు చక్కెరలు, కార్భోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి.
thyroid
థైరాయిడ్ అనేది ఒక గ్రంథి. ఇది శరీర పెరుగుదల, జీవక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. కానీ కొన్ని కారణాల వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు దెబ్బతింటుంది. అలాగే మీ థైరాయిడ్ గ్రంథి తగినంత థైరాయిడ్ హార్మోన్ ను ఉత్పత్తి చేయదు. దీనివల్ల ఎన్నో సమస్యలు వస్తాయి.
హైపర్ థైరాయిడిజం అనేది థైరాయిడ్ గ్రంథి అవసరమైన దానికంటే ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేసే పరిస్థితి. థైరాయిడ్ ఉన్నవారు తినాల్సిన, తినకూడని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
thyroid
కార్భోహైడ్రేట్లు, చక్కెరలు
కార్బోహైడ్రేట్లు, చక్కెరలు ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. లేదంటే థైరాయిడ్ గ్రంథి నియంత్రణలో ఉండదు. అలాగే విపరీతంగా బరువు పెరిగపోతారు. ఈ రెండు సమస్యలు రాకూడదంటే ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి.
thyroid
బంగాళాదుంప చిప్స్
బంగాళాదుంప చిప్స్, కుకీలు, కేకులు వంటి ఆహారాలకు కూడా థైరాయిడ్ పేషెంట్లు దూరంగా ఉండాలి. అలాగే ప్రాసెస్ చేసిన ఆహారాలను కూడా మానేయాలి. థైరాయిడ్ ఉన్నవారు వీటిని నివారించాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు సలహానిస్తారు. ఎందుకంటే ప్రాసెస్ చేసిన ఆహారాల్లో ఎక్కువ మొత్తంలో ఉప్పు, ఖనిజాలు ఉంటాయి.
thyroid health
తినాల్సిన ఆహారాలు
నిమ్మకాయ నీరు
థైరాయిడ్ పేషెంట్లు తీసుకోవాల్సిన వాటిలో నిమ్మకాయ నీరు ఒకటి. విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే లెమన్ వాటర్ థైరాయిడ్ హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతుంది. ఈ వాటర్ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
thyroid
జీర్ణక్రియ
ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారం జీర్ణక్రియను నియంత్రించడానికి సహాయపడుతుంది. అలాగే శరీరంలోని విషాన్ని తొలగిస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు మీ రోజువారీ ఆహారంలో చేర్చండి.
బ్రెజిల్ గింజలు, సార్డినెస్ చేపలు, గుడ్లు, చిక్కుళ్లు వంటి సెలీనియం ఎక్కువగా ఉండే ఆహారాలను కూడా తినండి. ఇవి మీ థైరాయిడ్ హార్మోన్ ను సమతుల్యంగా ఉంచుతాయి. మీ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.
క్యారెట్ జ్యూస్
క్యారెట్ జ్యూస్ థైరాయిడ్ ను నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఎక్కవుగా ఉండే క్యారెట్ జ్యూస్ ను తాగడం వల్ల థైరాయిడ్ కు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
thyroid
అశ్వగంధ
అశ్వగంధ, ఆస్పరాగస్ వంటి మొక్కలు థైరాయిడ్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కాబట్టి వీటితో తయారుచేసిన హెర్బల్ టీ లు హైపోథైరాయిడిజాన్ని నియంత్రించడానికి మీకు ఎంతో సహాయపడుతుంది.