MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Health
  • డయాబెటీస్ పేషెంట్లు తప్పనిసరిగా తినాల్సిన చిరుధాన్యాలు ఇవి..!

డయాబెటీస్ పేషెంట్లు తప్పనిసరిగా తినాల్సిన చిరుధాన్యాలు ఇవి..!

డయాబెటీసే పేషెంట్లకు కొన్ని రకాల చిరుధాన్యాలు ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయి. ఒకవేళ మీకు డయాబెటీస్ లేకపోయినా  వీటిని తింటే మీ ఆరోగ్యానికి ఏ డోకా ఉండదని నిపుణులు చెబుతున్నారు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 24 2023, 10:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

దేశంలో రోజు రోజుకు డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అందుకే ఇండియాను డయాబెటిస్ రాజధాని అని కూడా అంటుంటారు. దీన్ని నియంత్రించకపోతే కొన్నేండ్లలో భారత్ అత్యధిక మధుమేహ వ్యాధిగ్రస్తులున్న దేశంగా మారిపోతుంది. అయితే ఈ వ్యాధి రావడానికి భారతీయ జీవనశైలి, ఆహారమే కారణమంటున్నారు నిపుణులు. మన జీవనశైలి మిస్టేక్స్ వల్లే ఈ సమస్య పెరిగిపోతోందని నిపుణులు చెబుతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

డయాబెటిస్ జీవితాంతం జీవితాంతం మిమ్మల్ని విడిచిపెట్టదు. ఎందుకంటే దీన్ని పూర్తిగా నయం చేసుకోలేం. అందుకే ఈ వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అయితే ఈ వ్యాధి ఉన్నవారు దీన్ని నియంత్రించానికి ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అలాగే శారీరకంగా చురుగ్గా ఉండాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డయాబెటీస్ పేషెంట్లకు కొన్ని రకాల చిరుధాన్యాలు మంచి మేలు చేస్తాయి. వీటిని డయాబెటీస్ లేనివారు కూడా తినొచ్చు. ఎందుకంటే ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మరి మధుమేహులు ఎలాంటి చిరుధాన్యాలను ఖచ్చితంగా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

36


చిరుధాన్యాలు

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. చిరుధాన్యాల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచవు. ఇందులో ఉండే ప్రోటీన్, ఫైబర్ డయాబెటిస్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తాయి. ఇది శరీరంలో గ్లూకోజ్ శోషణను నెమ్మదింపజేస్తుంది. దీంతో డయాబెటిస్ రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగవు. ఇవి ఇన్సులిన్ సున్నితత్వాన్ని ప్రోత్సహిస్తుంది. ట్రైగ్లిజరైడ్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. చిరుధాన్యాల పిండితో తయారు చేసిన రోటీ మొదలైన వాటిని తినొచ్చు. 
 

46

రాగులు

పబ్ మెడ్ సెంట్రల్ ప్రకారం.. రాగుల్లో ఉండే పాలీఫెనాల్స్, యాంటీ డయాబెటిక్, యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు డయాబెటిస్ రోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. కానీ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. పాలీఫెనాల్స్ పండ్లు, కూరగాయలు, ధాన్యాలు వంటి మొక్కల ఆధారిత ఆహారాలలో ఉండే ఒక రకమైన సూక్ష్మపోషకాలు కూడా రాగుల్లో పుష్కలంగా ఉంటాయి. ఇది డయాబెటిస్ రోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
 

56

రాగులు నియాసిన్, రిబోఫ్లేవిన్, ఫోలేట్, థియామిన్ వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలకు గొప్ప మూలం. అంతేకాదు ఇవి మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. దీంతో మీరు కేలరీలను ఎక్కువగా తీసుకోలేరు. ఆహార కోరికలు కూడా తగ్గుతాయి. దీంతో మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. 
 

66

జొన్నలు

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. జొన్నల్లో స్మార్ట్ కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. దీని  గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ. దీన్ని తీసుకోవడం వల్ల గ్లూకోజ్ రక్తంలోకి ప్రవేశిస్తుంది. అలాగే ఇది వెంటనే రక్తంలో చక్కెర స్థాయిని పెంచదు.  అలాగే జొన్నలు అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని కూడా నియంత్రిస్తుంది. మీరు అన్నానికి బదులుగా జొన్నల రొట్టెను తినొచ్చు. టైప్ 2 డయాబెటిస్ పేషెంట్లకు ఇది మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved