మలబద్దకం తగ్గాలంటే.. ఈ జ్యూస్ లను తాగండి
మలబద్దకానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు కూడా మలబద్దకం సమస్య వస్తుంది. మలబద్దకానికి మన ఆహారమే ప్రధానకారణమంటున్నారు నిపుణులు.

మలబద్దకం చాలా మందిని వేధించే సర్వసాధారణ అనారోగ్య సమస్య. మలబద్దకం మన దైనందిన జీవితాన్నిఇబ్బంది పెడుతుంది. అందుకే దీన్ని వీలైనంత తొందరగా తగ్గించుకోవాలి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఎన్నో రకాల మందులు కూడా తీసుకుంటుంటారు. అయితే మలబద్దకానికి ఒకటి కాదు ఎన్నో కారణాలు ఉంటాయి. శరీరంలో ఆర్ద్రీకరణ స్థాయి తగ్గినప్పుడు మలబద్ధకం ఏర్పడే అవకాశం ఉంది. మలబద్ధకానికి మనం తినే ఆహారమే ప్రధాన కారణం.
వేయించిన ఆహారాలు లేదా ఫైబర్ తక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం, రోజంతా నీళ్లను తక్కువగా తాగడం, ఒత్తిడి పెరగడం వంటివన్నీ మలబద్దకానికి కారణమవుతాయి. మలబద్ధకం సమస్యను నివారించడానికి ఎలాంటి జ్యూస్ లను తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆపిల్ జ్యూస్
ఆపిల్ జ్యూస్ పేగు సమస్యలను దూరం చేయడంలో ఎఫెక్టీవ్ గా పని చేస్తుంది. యాపిల్స్ లో పెక్టిన్ ఉంటుంది. ఇది కరిగే ఫైబర్. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగించేందుకు బాగా సహాయపడుతుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారు యాపిల్స్ ను తింటే సమస్య తొందరగా తగ్గుతుంది. ఆపిల్ తొక్కను తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, అందులో జీలకర్ర పొడి వేసి, ఒక గ్లాసు నీళ్లు పోసి మిక్సీలో వేసి మెత్తగా చేయండి. ఈ జ్యూస్ ను వడకట్టి తాగండి.
ద్రాక్ష రసం
ద్రాక్ష రసం మీ శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. అలాగే మలబద్ధకం నుంచి ఉపశమనం పొందటానికి, మలం సులభంగా బయటకు పోవడానికి సహాయపడుతుంది. కరిగే ఫైబర్స్ ప్రేగు కదలికను ప్రోత్సహించడానికి సహాయపడతాయి. గుప్పెడు ద్రాక్ష గింజలను తీసుకుని అందులో అల్లం ముక్కను వేసి మిక్సీ పట్టండి. ఈ రసాన్ని తాగడం.
నిమ్మరసం
ఉదయం పరగడుపున ఒక కప్పు నిమ్మరసం తాగితే బరువు పెరగడం, గ్యాస్, మలబద్దకం వంటివి దూరం అవుతాయి. నిమ్మకాయ జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. గుండెల్లో మంటను తగ్గిస్తుంది. కడుపు నొప్పిని తగ్గిస్తుంది. నిమ్మరసం ప్రేగు కదలికలను మెరుగుపర్చి మలబద్దకాన్ని తగ్గిస్తుంది.