ఈ ఉదయపు అలవాట్లు మీ బరువును బాగా పెంచుతయ్.. ఫిట్ గా ఉండాలంటే ఇలా చేయండి
ఉదయం పూట కొన్ని పనులను చేస్తే రోజంతా చురుగ్గా, ఎనర్జిటిగ్ గా ఉండటంతో పాటుగా శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంంది. కానీ కొంతమందికి ఉన్న ఉదయపు అలవాట్లు వారిని ఊబకాయంతో పాటుగా ఎన్నో రోగాల బారిన పడేస్తున్నాయి. అవేంటంటే..
రోజు స్టార్టింగ్ బాగుండాలని అందరూ కోరుకుంటారు. కానీ మనకున్న కొన్ని అలవాట్లే మనల్ని రోజంతా మూడీగా, డిస్టబెన్ట్స్ గా ఉంచుతాయి. దీనివల్ల మీరు ఒత్తిడికి గురవుతారు. అందుకే మనకు చెడు చేసే అలవాట్లను వీలైనంత తొందరగా వదిలించుకోవాలి. ఎందుకంటే ఇవి మానసికంగా, శారీరకంగా ఎంతో ప్రభావం చూపుతాయి. ఈ అలవాట్ల వల్ల ఎన్నో రోగాల ముప్ప కూడా పొంచి ఉంది. మరి మనం మార్చుకోవాల్సిన కొన్ని అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Image: Getty
ఆలస్యంగా లేవడం..
రాత్రిళ్లు తొందరగా పడుకుంటే ఉదయం తొందరగా నిద్రలేస్తారు. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది లేట్ గా పడుకుని ఉదయం లేట్ గా నిద్రలేస్తుంటారు. ఈ అలవాటు మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. లేట్ గా నిద్రలేవడం వల్ల మీరు ఆఫీసుకు వెళ్లడానికి హడావిడి పడుతారు. బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేసే అవకాశం కూడా ఉంది. ఇది మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ ను తినడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీకు తెలుసా? ఎక్కువ సేపు నిద్రపోయే వారు ఊబకాయం బారిన పడే ప్రమాదం ఉంది.
Image: Getty
ఉదయాన్నే నీళ్లు తాగకపోవడం
ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే నీళ్లను తాగడం చాలా చాలా మంచిది. ఉదయాన్నే ఒక గ్లాసు నీటిని తాగడం వల్ల శరీరంలోని విష పదార్థాలన్నీ బయటకు పోతాయి. అలాగే జీర్ణవ్యవస్థ బలంగా ఉంటుంది. మీ జీవక్రియ కూడా ఫాస్ట్ గా ఉంటుంది. కాబట్టి ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో మీ రోజును స్టార్ట్ చేయండి. అలాగే రోజుకు ఎనిమిది గ్లాసుల నీటిని ఖచ్చితంగా తాగాలి.
అనారోగ్యకరమైన ఆహారాలు
ఉదయం పూట పిజ్జా, బర్గర్లు వంటి అనారోగ్యకరమైన ఆహారాలను తినకపోవడమే మంచిది. ఇవి మిమ్మల్ని ఎన్నో సమస్యలకు గురి చేస్తాయి. అలాగే ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేయకూడదు. ఇది మీ బరువును పెంచుతుంది. అందుకే మీ బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్, విటమిన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాలను చేర్చాలి.
తినేటప్పుడు టీవీ చూడటం
తినేటప్పుడు టీవీ చూసే అలవాటు కూడా మీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే దీనివల్ల మీరు అతిగా తినే అవకాశం ఉంది. ఇది మీ బరువును పెంచుతుంది. టీవీ చూస్తున్నప్పుడు ఎంత తింటున్నారో తెలియకుండా తింటారు. ఇది మిమ్మల్ని ఊబకాయం బారిన పడేస్తుంది.
ఉదయాన్నే వ్యాయామం చేయకపోవడం
ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మంచి ఆరోగ్యం కోసం ఆరోగ్యకరమైన ఆహారంతో పాటుగా వ్యాయామం కూడా ముఖ్యమే. ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటుగా అధిక రక్తపోటు కూడా తగ్గుతుంది. అలాగే మీరు బరువు పెరిగే అవకాశం కూడా ఉండదు.వ్యాయామం మిమ్మల్నిరోజంతా చురుగ్గా ఉంచుతుంది.