ఈ ఆకులు కూడా కీళ్ల నొప్పులను తగ్గిస్తయ్ తెలుసా?
వయసు పెరుగుతున్న కొద్దీ కీళ్ల నొప్పులు రావడం చాలా సహజం. దీనికి ఆర్థరైటిస్ తో పాటుగా ఎన్నో కారణాలు ఉంటాయి. అయితే కీళ్ల నొప్పులతో బాధపడేవారు కొన్ని రకాల ఆకులు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అవును ఆకులతో కూడా కీళ్ల నొప్పులను, వాపును తగ్గించుకోవచ్చు.
చలి పెరుగుతున్న కొద్దీ కీళ్ల నొప్పులు కూడా పెరుగుతుంటాయి. ఎముకలు, కీళ్లలో నొప్పి సాధారణంగా వయస్సుతో పాటు వస్తుంది. దీనికి ఎన్నో కారణాలు ఉంటాయి. వీటిలో ఆర్థరైటిస్ ఒకటి. ఆర్థరైటిస్ అనేది ఎముకల వ్యాధి. దీనివల్ల కీళ్లలో తేలికపాటి నుంచి చాలా నొప్పి కలుగుతుంది. ఆర్థరైటిస్ సమస్య ఎక్కువగా వృద్ధులకే వస్తుంది. కానీ ప్రస్తుత కాలంలో యువకులకు కూడా ఈ సమస్య వస్తుంది. దీనికి ఎన్నో కారణాలు ఉంటాయి. యువతకు కీళ్ల నొప్పుల సమస్య రావడానికి ప్రధాన కారణం పేలవమైన జీవనశైలే కారణమంటున్నారు నిపుణులు. ఇతర కారణాలు కూడా ఇందుకు కారణమవుతాయి.
joint pain
శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగినప్పుడు ఆర్థరైటిస్ నొప్పి పెరుగుతుంది. యూరిక్ ఆమ్లం కీళ్ల ఎముకల్లో వెళ్లినప్పుడు స్ఫటికాకార నిర్మాణాలు అభివృద్ధి చెందుతాయి. ఇవి క్రమంగా కీళ్లకు మద్దతునిచ్చే కుషన్లను పలుచగా చేస్తాయి. దీనివల్ల ఎముకలు ఒకదానికొకటి ఢీకొని నొప్పి కలుగుతుంది. కీళ్ల నొప్పులు ఉంటే హాస్పటల్ కు ఖచ్చితంగా వెళ్లాలి. అయితే కొన్ని ఇంటి చిట్కాలు కూడా కీళ్ల నొప్పులను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Image: Freepik
పుదీనా ఆకులు
పుదీనా ఆకులు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. ఈ ఆకుల్లో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్-ఎ, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఈ ఆకుల్లో శోథ నిరోధక లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి మన మూత్రం నుంచి ప్యూరిన్లను తొలగించి కీళ్ల నొప్పిని తగ్గిస్తాయి.
coriander leaves
కొత్తిమీర ఆకులు
కొత్తిమీర ఆకుల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. వీటిలో కాల్షియం, పొటాషియం, థయామిన్, ఫాస్పరస్, విటమిన్-సి, విటమిన్-కె వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. కొత్తిమీర రక్తంలో చక్కెరను నియంత్రించడానికి సహాయపడుతుంది. అలాగే రక్తంలో యూరిక్ ఆమ్లం, క్రియేటినిన్ స్థాయిని తగ్గిస్తుంది.
తమలపాకు
తమలపాకు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల యూరిక్ యాసిడ్ ను మూత్రం నుంచి బయటకు పోతాయి. మలపాకులను ఉదయాన్నే నమిలితే రోజంతా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు అంటున్నారు.
బే ఆకులు
బిర్యానీ ఆకులను ఎన్నో వంటల్లో ఉపయోగిస్తారు. ఇది ఫుడ్ రుచిని బాగా పెంచుతుంది. అంతేకాదు ఈ ఆకులు మన ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. బిర్యానీ ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మంటను, కీళ్ల నొప్పిని తగ్గిస్తాయి. బిర్యానీ ఆకులనునీటిలో మరిగించి తాగితే మోకాలి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.