MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Health
  • బరువు పెరగకుండా, తగ్గకుండా అంతే ఉండాలే ఏం చేయాలి?

బరువు పెరగకుండా, తగ్గకుండా అంతే ఉండాలే ఏం చేయాలి?

చాలా మంది ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగానే ఉంటారు. కొంతమంది చాలా తక్కువ బరువు ఉంటారు. కానీ కొందరు మాత్రం ఎంత బరువు ఉండాలో అంతే ఉంటారు. ఈ బరువును మెయింటైన్ చేయడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : May 31 2024, 05:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రస్తుత కాలంలో చాలా మంది ఎక్కువ బరువుతో బాధపడుతున్నారు. బరువు ఎక్కువగా ఉండే లేనిపోని రోగాలు వస్తాయి. అలాగే తక్కువ బరువున్నా సమస్యే. చాలా మంది ఎక్కువ లేదా తక్కువ బరువు ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే ఉండాల్సిన బరువు ఉంటారు. ఈ బరువు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎన్నో రోగాలు రాకుండా చూస్తుంది.అయితే ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం చాలా కష్టం. కానీ కొన్ని చిట్కాలతో మీరు బరువు పెరగకుండా, తగ్గకుండా ఉంటారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

భోజన అలవాట్లు

చాలా మందికి రాత్రి 9, 10 గంటల తర్వాతే భోజనం చేసే అలవాటు ఉంటుంది. కానీ ఇది మంచి అలవాటు కాదు. ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం మీరు రాత్రి 7 గంటలకు భోజనం చేసేయాలి. అలాగే రాత్రి 10 గంటలకల్లా పడుకోవాలి. దీనివల్ల మీరు తిన్న  ఆహారం బాగా జీర్ణం అవుతుంది. దీంతో మీ శరీరంలో కొవ్వు పెరిగే అవకాశం ఉండదు. 
 

36


హైడ్రేటెడ్ గా ఉండండి

ఆరోగ్యంగా ఉండాలంటే శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా అవసరం. ఆరోగ్యకరమైన జీవక్రియ కోసం, ఆకలిని నియంత్రించడానికి నీటిని పుష్కలంగా తాగాలి. ఆరోగ్యంగా ఉండేందుకు వయోజనులు రోజుకు కనీసం 2 లీటర్ల నీటిని తాగాలి. 

46

ఉప్పు వాడకం

ఉప్పు ఎంత తక్కువ వాడితే మీ ఆరోగ్యం అంత బాగుంటుంది. మీరు మీ రోజువారి ఆహారంలో ఎంత తక్కువ ఉప్పును ఉపయోగిస్తే మీ శరీరం తక్కువ నీటిని నిలుపుకుంటుంది. నీరు మిమ్మల్ని బరువు పెరగకుండా కాపాడుతుంది. 

56

చక్కెరకు దూరంగా ఉండండి

చక్కెర ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే షుగర్ లేనిపోని రోగాలొచ్చేలా చేస్తుంది. షుగర్ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగి డయాబెటిస్ తో పాటుగా మీరు  ఊబకాయం బారిన పడేలా చేస్తుంది. 
 

66

ఆల్కహాల్ మానుకోండి

ఆల్కహాల్ పానీయాలలో కూడా కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. అందుకే బరువు పెరగొద్దంటే మీరు ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. అలాగే ఒత్తిడి కూడా మీరు బరువు పెరగడానికి దారితీస్తుంది. ఎందుకంటే ఒత్తిడి వల్ల అతిగా తినే అవకాశం ఉంది. అందుకే ఒత్తిడిని తగ్గించండి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved