ఈ అలవాట్లు పురుషుల పురుషాంగాన్ని మరింత తగ్గిస్తాయి జాగ్రత్త..
చాలా మంది పురుషులు తమ ప్రైవేట్ భాగాలు చిన్నగా ఉన్నాయని ఆందోళన చెందుతుంటారు. నిజానికి ఇలా దీని పరిమాణం తగ్గడానికి కారణాలు చాలానే ఉన్నాయని తెలుసా?

penis
పురుషుల ప్రైవేట్ భాగాల పరిమాణం తగ్గడాన్నే కుదింపు అని కూడా అంటారు. దీనివల్ల మీరు లైంగిక జీవితంలో సంతోషంగా పాల్గొనలేరు. అందుకే చాలా మంది పురుషులు తమ పురుషాంగం పరిమాణాన్ని ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తుంటారు. కానీ కొన్ని అలవాట్లు పురుషాంగం సైజును మరింత తగ్గిస్తాయని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
penis
సోమరితనం, తగినంత వ్యాయామం చేయకపోవడం
సెడార్స్-సినాయ్ మెడికల్ సెంటర్ అధ్యయనం ప్రకారం.. వ్యాయామం ఎక్కువగా చేసే పురుషులు మంచి అంగస్తంభనను, లైంగిక పనితీరును కలిగి ఉంటారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే పురుషాంగం పెరుగుదల బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. అలాగే మూసుకుపోయిన రక్త నాళాలను క్లియర్ చేస్తుంది. దీంతో అంగస్తంభన, లైంగిక పనితీరు మెరుగుపడుతుంది.
penis
క్రమం తప్పకుండా పళ్లు తోమకపోవడం, పేలవమైన నోటి ఆరోగ్యం
అంగస్తంభన లోపం ఉన్న పురుషుల్లో చిగుళ్ల వ్యాధి 7 రెట్లు ఎక్కువగా ఉందని జర్నల్ ఆఫ్ పీరియాడోంటాలజీ పరిశోధకులు కనుగొన్నారు. చిగుళ్ల కణజాలంలో కనిపించే బ్యాక్టీరియా శరీరమంతా వ్యాపిస్తుంది. దీంతో మంట, ప్రైవేట్ భాగంలోని రక్త నాళాలు దెబ్బతింటాయి.
PENIS
జంక్ ఫుడ్ ను ఎక్కువగా తినడం
కుకీలు, కేకులు, చాక్లెట్, చిప్స్, వేయించిన భోజనం వంటి ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినే పురుషులు.. హెల్తీ ఫుడ్ ను తినే వారి కంటే తక్కువ-నాణ్యత కలిగిన స్పెర్మ్ కలిగి ఉన్నారని 2011 హార్వర్డ్ అధ్యయనం కనుగొంది. ఈ అనారోగ్యకరమైన ఫుడ్ స్థూలకాయానికి దారితీస్తుంది. శరీర బరువు, నడుము సైజు పెరిగేకొద్దీ ప్రైవేట్ భాగం చిన్నగా అవుతుంది.
మితిమీరిన ధూమపానం
స్మోకింగ్ పురుషాంగం పరిమాణాన్ని బాగా తగ్గిస్తుంది. ముఖ్యంగా ప్రైవేట్ భాగంతో సహా శరీరంలోని ఎన్నో అవయవాలకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. సిగరెట్లలోని హానికరమైన పదార్థాలు రక్త నాళాలను దెబ్బతీస్తాయి. ఇది అంగస్తంభనలోపం, పురుషాంగం కణజాలాలకు నష్టం కలిగిస్తుంది.
పండ్లు, కూరగాయలు తినకపోవడం
యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను తినడం వల్ల ప్రైవేట్ భాగాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇవి రక్త నాళాలలో ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. అలాగే రక్తనాళాల బలాన్ని పెంచడానికి సహాయపడతాయి. 2008 టెక్సాస్ ఎ అండ్ ఎం విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం.. పుచ్చకాయలో సిట్రులైన్-అర్జినిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది అంగస్తంభనకు చికిత్స చేయడానికి, అంగస్తంభన లోపాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.