Health Tips : పౌష్టికాహారం ఖరీదైన వ్యవహారం కాదు..బడ్జెట్ లో కూడా బోలెడంత పౌష్టికాహారం!
Health Tips: సాధారణంగా పౌష్టికాహారం అనేసరికి అందరూ ఖరీదైన వ్యవహారంతో కూడుకున్న పని అనుకుంటారు. నిజమే కానీ పేదవాడి బడ్జెట్ తో కూడా బోల్డంత పౌష్టికాహారాన్ని పొందవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా డాక్టర్లు పౌష్టికాహారం తీసుకోవడం మీకు చాలా అవసరం అని చెప్పినప్పుడు సామాన్యుడు మొహం వేలాడేస్తాడు. అదంతా ఖరీదైన వ్యవహారం మనవల్ల కాదు అనుకుంటాడు. నిజానికి నిజమైన పౌష్టికాహారం మన బడ్జెట్ లో కూడా ఉంటుంది. కావలసిందల్లా అవగాహన మాత్రమే.
ఆరోగ్యం బాగోలేని ఒక పేద రోగి డ్రై ఫ్రూట్స్ ని కొనుక్కొని తినలేడు కానీ అవే పోషకాలు మన బడ్జెట్ లో ఉండే ఆకుకూరల్లో కూడా లభిస్తాయని తెలుసుకుంటే చాలు. మన ఆరోగ్యకరమైన శరీరానికి కార్బోహైడ్రేట్లు ఎంతో అవసరం.
అవి మీ రోజువారి కార్యకలాపాలను చేసుకోవడానికి మీ శరీరానికి తగిన శక్తిని ఇస్తుంది. ఒక గ్రాము కార్బోహైడ్రేటు నాలుగు క్యాలరీలకు సమానము. అయితే ఈ కార్బోహైడ్రేట్లు మన బడ్జెట్ లోనే ఉండే బంగాళదుంపలు తాజా పండ్లు మరియు పిండి పదార్థాలలోని లభిస్తాయి.
అలాగే శరీరంలో కొవ్వు కూడా చాలా అవసరం. విటమిన్ ఈ, డి, ఏ,కె యొక్క జీవక్రియని పెంచడానికి కొవ్వులు వినియోగం కూడా చాలా అవసరం. ఇవి మన బడ్జెట్ లోనే దొరుకుతాయని తెలుసా.. నిజమేనండి కొవ్వులు అవకాడో, గింజలు, ఆలివ్, వంటి ఆహార పదార్థాలలో, ఎక్కువగా ఉంటాయి.
అలాగే బాడీకి అవసరమైన ఫైబర్ మనం రోజు తినే అన్నం, పప్పు, రొట్టెలు మరియు ఆకుకూరలలో ఎక్కువగా దొరుకుతుంది. గోధుమ బ్రెడ్ యొక్క మూడు ముక్కలు, ఒక ఉడికించిన కోడిగుడ్డు అలాగే కొంత పన్నీరు ఒక పూటకి సరిపోయే ఒక చక్కని ఆరోగ్యకరమైన ఆహారం.
అలాగే రెండు చపాతీలు, ఒక కప్పు బంగాళదుంప కూర రాత్రిపూటకి ఎంతో ఆరోగ్యకరమైన భోజనం. కాబట్టి మనం రోజు తినే ఆకుకూరలు, కాయగూరలు, గుడ్లు, పన్నీరు వంటి వాటిలోనే తగినంత పౌష్టికాహారం ఉంది.