Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Health
  • Test Your Health: మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో కేవలం సెకన్లలో చెప్పొచ్చు.. ఎలాగంటే..

Test Your Health: మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో కేవలం సెకన్లలో చెప్పొచ్చు.. ఎలాగంటే..

Test Your Health: మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో తెలుసుకోవాలంటే ప్రత్యేకమైన మెడికల్ టెస్ట్ లు చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే మీకు మీరుగా చిన్న టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. దీనికోసం కేవలం కొన్ని సెకన్ల టైమ్ కేటాయిస్తే చాలు. అదెలాగో తెలుసుకుందాం రండి. 

Naga Surya Phani Kumar | Published : Feb 14 2025, 03:49 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

శరీరం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలం. కాని మీ శరీరం మీ లక్ష్యాన్ని సాధించడానికి మీకు సహకరించేలా, ఆరోగ్యంగానే ఉందా? ఇది తెలుసుకోవాలంటే ప్రతి సారీ డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఫిట్ నెస్ కి సంబంధించి రకరకాల టెస్ట్ లు చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లోనే చిన్న టెస్ట్ చేసుకోవచ్చు. 
 

25
Asianet Image

వయసు పెరిగే కొద్దీ శరీరం శక్తిని కూడా కోల్పోతుంది. అయితే మీలో ఎంత శక్తి ఉంటుందో అంతకాలం మాత్రమే మీకు ఆయుష్షు ఉంటుంది. మరి ఆ శక్తి ఎంత ఉందో తెలియాలంటే మీరు ఈ స్టాండింగ్ టెస్ట్ కి సిద్ధమవ్వండి. దీని కోసం ఏం చేయాలంటే.. ఒంటి కాలిపై కొన్ని సెకన్ల పాటు నిల్చోవాలి. మీ ఎంత తక్కువ సేపు నిల్చొంటే మీ శరీరంలో శక్తి అంత తక్కువగా ఉందని అర్థం. 
 

35
Asianet Image

ఈ విషయాన్ని బ్రిటన్, అమెరికా, బ్రెజిల్, ఫిన్లాండ్, తదితర దేశాల్లోని పరిశోధకులు వివిధ రకాల మనుషుల్ని పరీక్షించి కనిపెట్టారు. 51 నుంచి 75 సంవత్సరాల లోపు ఉన్న వారిపై ఈ స్టాండింగ్ టెస్ట్ చేశారు. వారిలో 20 శాతం మంది కనీసం 10 సెకన్లు కూడా నిలబడలేకపోయారట. వారిలో చాలా మంది కేవలం పదేళ్లలోపే అనేక ఆరోగ్య సమస్యలతో మరణించారట. 
 

45
Asianet Image

ఏ వయసు వారు ఎంత సేపు నిలబడాలి
ఏ వయసు వారు ఎంత సేపు నిలబడాలో పరిశోధకులు తమ రిపోర్ట్ లో వివరించారు. దాని ప్రకారం..
50 ఏళ్ల వయసున్న వారు ఒంటి కాలిపై కనీసం 40 సెకన్లు నిల్చోవాలి.
60 ఏళ్లు ఉన్న వారు 20 సెకన్లు
70 ఏళ్లు ఉన్న వారు కనీసం 10 సెకన్లయినా ఒంటి కాలిపై నిల్చోవాలి.
50 ఏళ్ల కంటే తక్కువ ఉన్న వారు ఎంత ఎక్కువ సేపు ఒంటికాలిపై నిల్చోగలిగితే అంత ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. 

55
Asianet Image

ఈ టెస్ట్ లో ఫెయిల్ అయిన వారికి త్వరగానే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి మీరు కూడా ఓ సారి ఈ టెస్ట్ చేసుకొని మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో చెక్ చేసుకోండి. ఫిట్ గా లేకపోతే వెంటనే తగిన వ్యాయామాలు, డైట్ ఫాలో అవడం మంచిది.
 

Naga Surya Phani Kumar
About the Author
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది. Read More...
 
Recommended Stories
Top Stories