కీళ్ల నొప్పుల నుంచి మధుమేహం వరకు అన్ని రోగాలను తరిమికొట్టే ఆహారం ఇదే!
ప్రస్తుత కరోనా కాలంలో అందరిలోనూ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెరిగింది. కనుక తీసుకునే ఆహారంలో పోషకాలు ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో కొర్రలను (Korralu) తినడానికి ఇష్టపడుతున్నారు. ఇందులో అనేక మినరల్స్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక అనారోగ్య సమస్యల (Illness issues) నుంచి కాపాడుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- FB
- TW
- Linkdin
Follow Us

కొర్రలు శరీరానికి మంచి హెల్తి ఫుడ్ (Healthy Food). ఇందులో కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థం, తక్కువ కొవ్వు పదార్థాలు, మెగ్నీషియమ్, ఐరన్, జింక్ వంటి ఇతర ఖనిజాలు ఉంటాయి. వీటితోపాటు యాంటీ ఆక్సిడెంట్లు, బి1, బి2, బి5, బి6, విటమిన్ ఇ వంటి విటమిన్లు (Vitamins) పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అందించే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. కనుక మనం తీసుకునే ఆహారంలో కొర్రలను భాగంగా చేసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు
ఎముకలు దృఢంగా ఉంటాయి: కొర్రలలో ఉండే అధిక మొత్తంలో క్యాల్షియం (Calcium) ఎముకల దృఢత్వానికి (Bone Strength) సహాయపడుతుంది. దీంతో ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి.
కండరాలను ఆరోగ్యంగా ఉంటాయి: కొర్రలలో క్యాల్షియం (Calcium), ఐరన్ పుష్కలంగా ఉంటాయి. కనుక వీటిని తీసుకుంటే కండరాలకు తగిన ఆక్సిజన్ అందుతుంది. దాంతో కండరాలు ఆరోగ్యంగా (Muscle health) ఉంటాయి.
అనీమియా సమస్యలు తగ్గుతాయి: కొర్రలలో ఉండే ఐరన్ (Iron) ను అనీమియా (Anemia) సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. కనుక కొర్రలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.
జ్ఞాపకశక్తి పెరుగుతుంది: కొర్రలలో ఉండే అనేక రకాల విటమిన్లు మెదడు పనితీరును మెరుగుపరిచి మెదడును యాక్టివ్ గా ఉంచుతాయి. మెదడుకు ఆక్సిజన్ సరఫరాను పెంచి జ్ఞాపకశక్తి (Memory), ఏకాగ్రతను (Concentration) పెంచుతాయి.
గుండె జబ్బులు తగ్గుతాయి: కొర్రలను తీసుకుంటే గుండెను ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్ బి1 (Vitamin B1) గుండె జబ్బులు (Heart disease) రాకుండా సహాయపడి అనేక తీవ్రమైన అనారోగ్య సమస్యల నుండి కాపాడుతుంది.
డయాబెటిస్ అదుపులో ఉంటుంది: కొర్రలు రక్తంలో చక్కెర స్థాయిలను (Sugar levels) కలవడాన్ని నెమ్మదిపరుస్తుంది. దీంతో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. కనుక డయాబెటిస్ (Diabetes) ఉన్నవారు కొర్రెలను తీసుకుంటే డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
బరువును నియంత్రణలో ఉంచుతుంది: అధిక బరువుతో బాధపడుతున్న వారు కొర్రలను తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ (Cholesterol levels) తగ్గుతాయి. బరువు నియంత్రణలో (Weight control) ఉంటుంది. కనుక బరువు తగ్గాలనుకునే వారు వారి డైట్ లో కొర్రలను చేర్చుకోవడం మంచిది.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది: కొర్రలలో ఉండే అనేక పోషకాలు అనేక వ్యాధుల నుండి కాపాడి ఇన్ఫెక్షన్లు (Infections) రాకుండా సహాయపడతాయి. కాబట్టి కొర్రలను తీసుకుంటే రోగనిరోధక శక్తి (Immunity) పెరుగుతుంది. ఇవి శరీరానికి కావలసిన తక్షణ శక్తిని అందిస్తాయి.
జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది: పీచుపదార్ధము (Fiber) కొర్రలలో అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే మలబద్దకం (Constipation) వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.