పండుగ స్పెషల్ బియ్యప్పిండితో స్వీట్ పూరి.. ఎంత రుచిగా ఉంటుందో తెలుసా?
అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఎంతో తొందరగా తయారు చేసుకునే బియ్యప్పిండి స్వీట్ పూరీలను ట్రై చేయండి. వీటి తయారీ విధానం సులభం. తక్కువ సమయంలో తక్కువ పదార్థాలతో తయారు చేసుకునే ఈ స్వీట్ పూరీలు ఎంతో రుచిగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం బియ్యప్పిండి స్వీట్ పూరీల ( sweet purilu) తయారీ విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చాలామంది స్వీట్ ప్రియులు (Sweets) ఉంటారు. అలాంటివారు బియ్యప్పిండితో స్వీట్ పూరీలను తయారు చేసుకొని తినండి. ఇందులో చక్కెరకు బదులుగా బెల్లాన్ని ఉపయోగిస్తాం కనుక ఆరోగ్యానికి (Health) కూడా మంచిది. ఈ స్వీట్ పూరీలను పండుగ సమయంలో ఇంటికి వచ్చిన అతిథులకు సర్వ్ చేయడానికి కూడా బాగుంటాయి.
కావలసిన పదార్థాలు: ఒక కప్పు బియ్యప్పిండి (Rice flour), సగం కప్పు బెల్లం (Jaggery), రెండు టేబుల్ స్పూన్ ల కొబ్బరి పొడి (Coconut powder), సగం టీ స్పూన్ యాలకుల పొడి (Cardamom powder), వేయించుకోవడానికి సరిపడు ఆయిల్ (Oil), సగం కప్పు నీళ్లు (Water), ఒక టీ స్పూన్ నెయ్యి (Ghee).
తయారీ విధానం: స్టవ్ మీద కడాయి పెట్టి అందులో సగం కప్పు బెల్లం (Jaggery), సగం కప్పు నీళ్లు పోసి ఉడికించుకోవాలి. తీపి ఎక్కువగా ఇష్టపడేవారు బెల్లం మరింత ఎక్కువ చేర్చుకోవచ్చు.
బెల్లం బాగా కరిగిన తరువాత సగం టీ స్పూన్ యాలకుల పొడి, రెండు టేబుల్ స్పూన్ ల కొబ్బరి పొడి, ఒక టీ స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నాలుగు కప్పుల బియ్యప్పిండి వేసి తక్కువ మంట మీద బాగా కలుపుకోవాలి.
పిండిని బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండిని బాగా కలుపుకోవాలి. పిండి మరీ పొడిగా ఉంటే అవసరమైతే కొన్ని నీళ్ళు చిలకరించి చపాతి పిండిలా కలుపుకోవాలి.
చిన్న చిన్న ఉండలుగా తీసుకొని చపాతీలా మందంగా ఒత్తుకుని చిన్న చిన్న పూరీల్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఢీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి.
ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో పూరీలను వేసి తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి. పూరీలను ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే గట్టిగా అవుతాయి. కనుక మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్ లో ఉంచుకోవాలి.
ఇలా మొత్తం పూరీలను ఫ్రై చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన బియ్యప్పిండి స్వీట్ పూరీలు (Sweet Poori) రెడీ. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ స్వీట్ పూరీలను ఒకసారి ట్రై చేయండి.