నోరూరించే రుచికరమైన బాదంపూరీ స్వీట్ రెసిపీ.. ఎలా చెయ్యాలంటే?
తీపి తినాలనిపించినప్పుడు రొటీన్ గా చేసుకునే తీపి పదార్థాలకు బదులుగా ఈ సారి కాస్త వెరైటీగా బాదం పూరీలను ట్రై చేయండి.

ఈ స్వీట్ చక్కెర పాకంతో నిండి చాలా టేస్టీగా (Tasty) ఉంటుంది. ఈ స్వీట్ తయారీ విధానం కూడా సులభం. ఈ స్వీట్ పూరీలను తినడానికి మీ కుటుంబ సభ్యులు ఇష్టపడతారు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం బాదంపూరీ (Badampuri) స్వీట్ ఐటమ్ తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు: రెండు కప్పుల మైదా (Maida), సగం కప్పు బాదం పొడి (Almond powder), రెండు టేబుల్ స్పూన్ ల బొంబాయి రవ్వ (Ravva), సగం కప్పు పాలు (Milk), పావు స్పూన్ ఉప్పు (Salt), పావు స్పూన్ బేకింగ్ పౌడర్ (Baking powder), ఒక స్పూన్ పంచదార (Sugar), కొన్ని లవంగాలు (Cloves), రెండు టేబుల్ స్పూన్ ల నెయ్యి (Ghee), ఢీ ఫ్రైకి సరిపడా ఆయిల్ (Oil).
పాకం కోసం: ఒక కప్పు పంచదార (Sugar), సగం కప్పు నీళ్లు (Water), కొన్ని కుంకుమ పువ్వు రేకులు (Saffron), చిటికెడు యాలకుల పొడి (Cardamom powder).
తయారీ విధానం: ఒక గిన్నె తీసుకొని అందులో మైదా, బొంబాయి రవ్వ, బాదం పొడి, బేకింగ్ పౌడర్, పంచదార, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి (Mix well). తరువాత ఇందులో పాలు పోసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పంచదార పాకం (Caramel) కోసం ఒక గిన్నె తీసుకొని అందులో పంచదార, నీళ్లు పోసి స్టౌ మీద పెట్టి బాగా మరిగించాలి.
పాకం బాగా మరుగుతున్నప్పుడు ఇందులో చిటికెడు యాలకుల పొడి (Cardamom powder), కుంకుమ పువ్వు (Saffron) రేకులను వేయాలి. పంచదార కరిగి తీగపాకం వస్తున్నప్పుడు దింపేయాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఢీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కేలోపు ముందుగా కలుపుకున్న పిండిని కొద్దికొద్దిగా తీసుకొని చిన్న చిన్న పూరీల్లా వత్తుకోవాలి.
ఇలా చేసుకున్న పూరీలపై నెయ్యిరాసి మధ్యకు మడవాలి. మళ్లీ నెయ్యిరాసి త్రికోణ ఆకృతిలో (Triangular shape) వచ్చేలా మరిచి కొద్దిగా వత్తి లవంగాన్ని గుచ్చాలి. ఇలా మొత్తం పిండిని చేసుకుని కాగుతున్న ఆయిల్ లో వేసి మంచి కలర్ వచ్చేంత వరకూ తక్కువ మంట (Low flame) మీద వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేయించుకున్న బాదం పూరీలన్నింటిని చక్కెర పాకంలో వేసి ఐదు నిమిషాలయ్యాక తీయాలి.
అంతే ఎంతో రుచికరమైన నోరూరించే బాదంపూరీలు రెడీ (Ready). ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ స్వీట్ ఐటమ్ (Sweet item) ను ఒకసారి ట్రై చేయండి. ఇలా ఎప్పటికప్పుడు వెరైటీగా ట్రై చేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి కొత్త రుచులను ఆస్వాదించండి.