పుల్లపుల్లగా స్పైసీగా పచ్చి మామిడికాయ రసం.. భలే టెస్ట్ తెలుసా?
పచ్చిమామిడి కాయలతో పచ్చడి, పప్పు, పులిహోరలను ట్రై చేస్తూంటాం. కానీ పచ్చిమామిడి కాయలతో చాలా రకాల వంటలను ట్రై చేయొచ్చు. ఈసారి పచ్చిమామిడి కాయలతో రసాన్ని ట్రై చేయండి.

పచ్చిమామిడి కాయలతో చేసుకునే రసం పుల్లపుల్లగా స్పైసీగా భలే రుచిగా (Good taste) ఉంటుంది. ఈ రసం తయారీ విధానం కూడా సులభం. ఇంకెందుకు ఆలస్యం పచ్చిమామిడి కాయ రసం (Raw mango juice) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు: ఒక కప్పు పచ్చి మామిడికాయ ముక్కలు (Raw mango slices), ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు (Kandipappu), నాలుగు ఎండు మిరపకాయలు (Dried chillies), సగం కప్పు టమోటో (Tomato) ముక్కలు, ఒక టీస్పూన్ ధనియాల పొడి (Coriander powder).
ఒక టీస్పూన్ అల్లం వెల్లుల్లి తరుగు (Reduce ginger garlic), ఒక టీస్పూన్ జీలకర్ర (Cumin), ఒక టీస్పూన్ మిరియాలు (Pepper), సగం టీస్పూన్ పసుపు (Turmeric), కొన్ని కరివేపాకులు (Curries), రుచికి సరిపడా ఉప్పు (Salt), కొత్తిమీర (Coriyander) తరుగు, ఒక టీస్పూన్ నూనె (Oil).
తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కందిపప్పు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర ఇలా ఒకదాని తరువాత ఒకటి వేసి వేయించుకోవాలి. ఇవన్నీ చల్లారిన తరువాత మెత్తగా గ్రైండ్ (Grind) చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో టమోటో ముక్కలు, పచ్చి మామిడికాయ ముక్కలు అలాగే కొన్ని నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి (Cook well).
పచ్చిమామిడికాయ (Raw mango slices), టమోటాలు (Tomatoes) ముక్కలు బాగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక గుజ్జులా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రసానికి సరిపడు నీళ్లు, పసుపు, అల్లం వెల్లుల్లి తరుగు వేసి కలుపుకోవాలి. అలాగే ఇందులో ముందుగా తయారు చేసుకున్న కందిపప్పు, మిరియాల పొడిని కూడా వేసి స్టవ్ మీద పెట్టి మరోసారి బాగా ఉడికించుకోవాలి.
రసం బాగా మరిగిన తరువాత చివరిలో కొత్తిమీర (Coriyander) తరుగు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపుకోసం స్టవ్ మీద కడాయి పెట్టి నూనె (Oil) వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తరువాత ఆవాలు, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకుని ముందుగా తయారుచేసుకున్న రసానికి తాలింపు పెట్టాలి. అంతే ఎంతో రుచికరమైన పచ్చిమామిడికాయ రసం రెడీ.
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. పచ్చిమామిడి కాయలతో చేసుకునే వంటలను వేసవికాలంలో ఎక్కువగా తీసుకుంటే వడదెబ్బ (Sunstroke) తగలకుండా ఉంటుంది. పచ్చిమామిడి కాయలలో అనేక పోషకాలు (Nutrients) ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. కనుక సీజన్ లో లభించే పచ్చిమామిడి కాయలను ఏదో ఒక విధంగా శరీరానికి అందిస్తే ఆరోగ్యంగా ఉంటారు.