సొరకాయ సెనగపప్పు మసాలా కూర ఇలా చేస్తే లొట్టలేసుకుని తింటారు!?
సొరకాయలో (Sorakaya) నీటి శాతం అధికంగా ఉంటుంది. కనుక దీన్ని తీసుకుంటే శరీరం డిహైడ్రేషన్ బారినపడకుండా ఉంటుంది.

అలాగే అనేక ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతమవుతాయి. కనుక సొరకాయతో వంటలను ట్రై చేయండి. సొరకాయ మసాలా కూరను సెనగపప్పుతో కలిపి వండుకుంటే కూర భలే రుచిగా ఉంటుంది. దీని తయారీ విధానం కూడా సులభం. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం సొరకాయ సెనగపప్పు మసాలా (Sorakaya chana dal masala) కూర తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు: ఒక కప్పు సెనగపప్పు (Chana dal), అరకేజీ సొరకాయ (Sorakaya), ఒక ఉల్లిపాయ (Onion), మూడు టమోటాలు (Tomatoes), రెండు పచ్చిమిరపకాయలు (Chilies), రెండు ఎండు మిరపకాయలు (Dried chillies), రెండు బిర్యానీ ఆకులు (Biryani leaves), ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ (Ginger garlic paste), సగం స్పూన్ పసుపు (Turmeric), సగం స్పూన్ కసూరి మేథి (Kasuri Methi).
ఒక స్పూన్ కాశ్మీరి చిల్లీ పౌడర్ (Kashmiri chilli powder), ఒక స్పూన్ ధనియాల పొడి (Coriander powder), ఒక స్పూన్ జీలకర్ర పొడి (Cumin powder), ఒక చిటికెడు ఇంగువ (Hing), సగం స్పూన్ గరం మసాలా (Garam masala), రుచికి సరిపడా ఉప్పు (Salt), ఒక స్పూన్ కారం (Chili powder), సగం స్పూన్ సోంపు (Anise), కొద్దిగా కొత్తిమీర (Coriander) తరుగు, రెండు స్పూన్ ల నెయ్యి (Ghee), నాలుగు టేబుల్ స్పూన్ ల నూనె (Oil).
తయారీ విధానం: ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక గంట పాటు నానబెట్టుకున్న సెనగపప్పు (Soaked Chana dal), తొక్క తీసి కట్ చేసుకున్న సొరకాయ (Sorakaya) ముక్కలు, ఒక కప్పు నీళ్లు, కొద్దిగా ఉప్పు, పావు స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, నెయ్యి వేసి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి వేడెక్కిన తరువాత బిర్యానీ ఆకులు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, సోంపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ తరుగు వేసి మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుని పచ్చిమిర్చి చీలికలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన (Raw smell) పోయేంత వరకు ఫ్రై (Fry) చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు చిటికెడు ఇంగువ, కసూరి మేథి, కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసి మసాలాలన్నీ బాగా కలిపి (Mix well) ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ బాగా వేగిన తరువాత ఒక టమోటా పేస్టు, ఒక టమోటా తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి తక్కువ మంట మీద ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి (Cook well.).
టమోటా మిశ్రమం బాగా ఉడికిన తరువాత ముందుగా ఉడికించుకున్న సొరకాయ, సెనగపప్పు మిశ్రమాన్ని వేసి మరో ఐదు నిమిషాలు కూర నుంచి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చివరిలో కొత్తిమీర (Coriander) తరుగు, గరం మసాలా (Garam masala) వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
అంతే ఎంతో రుచికరమైన (Delicious) నోరూరించే స్పైసీ (spicy) సొరకాయ సెనగపప్పు మసాలా కూర రెడీ. ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కూరను వేడివేడి అన్నం, రోటీతో తింటే భలే రుచిగా ఉంటుంది. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. ఈ రెసిపీ మీ కుటుంబ సభ్యులకు తప్పక నచ్చుతుంది.