కరకరలాడే నోరూరించే మురుకులు ఎలా చేయాలో తెలుసా?
పండుగ అంటే మనకు ముందుగా గుర్తుకువచ్చేది పిండి వంటలు. మరి ఈ సంక్రాంతికి ఏ పిండి పదార్థాలు తయారు చేయాలని ఆలోచిస్తుంటే ఎంతో సులభంగా తయారు చేసుకునే మురుకులను ట్రై చేయండి. ఇవి తినడానికి కరకరలాడుతూ ఎంతో రుచిగా (Delicious) ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం మురుకులు (Murukulu) తయారీ విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు: సగం కప్పు మినప్పప్పు (Black gram), సగం కప్పు పెసరపప్పు (Green gram), నాలుగు కప్పుల బియ్యప్పిండి (Rice flour), రెండు టీ స్పూన్ ల కారం (Chilli powder), రుచికి సరిపడా ఉప్పు (Salt), నాలుగు టీ స్పూన్ ల నువ్వులు (Sesame seeds), ఒక టీ స్పూన్ జీలకర్ర (Cumin seeds), సగం టీస్పూన్ వాము (Ajowan), వేయించుకోవడానికి సరిపడు ఆయిల్ (Oil).
తయారీ విధానం: ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో మినపప్పు (Black gram), పెసరపప్పు (Green gram) వేసి రెండు సార్లు నీళ్లతో బాగా శుభ్రపరచుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్ళు పోసి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
కుక్కర్ ఆవిరి తగ్గిన తర్వాత మూత తీసి ఉడికించుకున్న పప్పులను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ (Grind) చేసుకోవాలి. ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో బియ్యప్పిండి, ఉప్పు, కారం, నువ్వులు, వాము, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి (Mix well).
ఇప్పుడు ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేడి ఆయిల్ (Hot oil) ను వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉడికించి మెత్తగా గ్రైండ్ చేసుకున్న పప్పును కూడా వేసి కలుపుకోవాలి. ఇందులో కొన్ని కొన్ని నీళ్ళు (water) పోస్తూ పిండిని ముద్దగా కలుపుకోవాలి.
ఇప్పుడు మురుకుల గొట్టం తీసుకొని ఆయిల్ (Oil) అప్లై చేసుకొని ఇందులో మురుకుల మిశ్రమాన్ని పెట్టి గుండ్రంగా చుట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఢీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో మురుకులను వేసి తక్కువ మంట (Low flame) మీద మంచి కలర్ వచ్చేంత వరకూ ఫ్రై చేసుకోవాలి.
ఇలా ఫ్రై చేసుకున్నా మురుకులను ఒక ప్లేట్ లో తీసుకోవాలి. ఇలా మొత్తం పిండిని ఫ్రై చేసుకోవాలి. అంతే వేడి వేడి మురుకులు రెడీ (Ready). ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ మురుకులను ఒకసారి ట్రై చేయండి. వీటి రుచి కూడా బాగుంటాయి.
పండుగ సమయంలో ఇంటికి వచ్చిన అతిథులకు సర్వ్ (Serve) చేస్తే ఇవి వారికి బాగా నచ్చుతాయి. మురుకులు తయారీ కోసం ఉపయోగించిన నువ్వులు, జీలకర్ర, వాము, పెసరపప్పు, మినపప్పు ఆరోగ్యానికి (Health) మంచివి. కనుక ఇది ఒక హెల్తీ స్నాక్స్ ఐటమ్ అని చెప్పవచ్చు.