నల్లమచ్చలను తగ్గించి ముఖాన్ని కాంతివంతంగా మార్చే సూపర్ టిప్స్..!
ముఖంపైన ఏర్పడ్డ నల్లమచ్చల (Black spots) కారణంగా ముఖం కాంతిహీనంగా, నిర్జీవంగా కనిపిస్తుంది. ఇవి తగ్గించుకోవడానికి బ్యూటీ ప్రొడక్ట్స్ బదులు హోమ్ రెమిడీస్ ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇంటిలో అందుబాటులో ఉండే పదార్థాలను సౌందర్య లేపనాలుగా (Cosmetics) ఉపయోగిస్తే చర్మానికి మంచి ఫలితాలను పొందవచ్చు. ఇవి మీ ముఖంపై ఏర్పడ్డ నల్లమచ్చలను తగ్గిస్తాయి. అలాగే చర్మకణాలు (Skin cells) లోపలినుంచి శుభ్రపడి చర్మం తాజాగా, ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో మీ చర్మ సౌందర్యం మరింత రెట్టింపవుతుంది.
పుచ్చకాయ గుజ్జు, పెరుగు: ఒక కప్పులో పుచ్చకాయ గుజ్జు (Watermelon pulp) కొద్దిగా పెరుగు (Yogurt) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా వారానికి రెండు మూడుసార్లు ప్రయత్నిస్తే నల్లమచ్చలు క్రమంగా తగ్గుతాయి.
బంగాళదుంప రసం, పసుపు: ఒక కప్పులో కొద్దిగా బంగాళదుంప రసం (Potato juice), పసుపు (Turmeric) వేసి బాగా కలుపుకోని ముఖానికి, మెడకు బాగా అప్లై చేసుకుని పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రపరచుకోవాలి. ఈ మిశ్రమంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు నల్లమచ్చలను తగ్గించి చర్మానికి మంచి నిగారింపును అందిస్తాయి.
బేకింగ్ సోడా, నిమ్మరసం, పంచదార: ఒక కప్పులో కొద్దిగా బేకింగ్ సోడా (Baking soda), రెండు టేబుల్ స్పూన్ ల నిమ్మరసం (Lemon juice), ఒక టేబుల్ స్పూన్ పంచదార (Sugar) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సున్నితంగా నల్లమచ్చలు ఉన్న ప్రవేశంపై రుద్దాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే నల్లమచ్చలు తగ్గుతాయి.
లీచి మిశ్రమం: లీచి మిశ్రమాన్ని (Lychee) కాటన్ బాల్స్ సహాయంతో నల్లమచ్చలు ఉన్న ప్రదేశంలో అప్లై చేసుకోవాలి. పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇందులో ఉండే ఒలొగోనల్, విటమిన్ సి నల్లమచ్చలను తగ్గించడంతో పాటు వృద్ధాప్య ఛాయలు (Aging shades) కూడా తగ్గిస్తాయి. దీంతో యవ్వనంగా కనిపిస్తారు.
పాలు, కుంకుమ పువ్వు: రెండు టేబుల్ స్పూన్ ల పాలలో (Milk) కొద్దిగా కుంకుమపువ్వు (Saffron) నానబెట్టి ఈ మిశ్రమాన్ని కాటన్ బాల్స్ సహాయంతో నల్లమచ్చలు ఉన్న ప్రదేశంపై అప్లై చేసుకొని ఇరవై నిమిషాల తరువాత శుభ్రపరచుకోవాలి. ఇలా చేస్తే ముఖంపైన ఏర్పడ్డ నల్లమచ్చలు తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది.
బొప్పాయి గుజ్జు: బొప్పాయి గుజ్జులో (Papaya pulp) ఉండే యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) నల్లమచ్చలను తగ్గిస్తాయి. కనుక బొప్పాయి గుజ్జును ముఖానికి అప్లై చేసుకుని అరగంట తరువాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా వారానికి రెండు మూడుసార్లు ప్రయత్నిస్తే క్రమంగా నల్లమచ్చలు తగ్గడంతోపాటు చర్మం మృదువుగా మారుతుంది.