Summer: ఎండాకాలంలో వీటిని మాత్రం తినకూడదు, ఎందుకంటే
ఎండాకాలంలో శరీరాన్ని చల్లగా, హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే అవి ఈ సీజన్‌లో శరీరం కోసం అంత మంచివి కావు. వేసవిలో ఏ ఆహారాలకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం.

EatingEating
ఎండాకాలం ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. ఈ కాలంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. వేసవిలో కొన్ని ఆహారాలు డీహైడ్రేషన్‌కు కారణం కావచ్చు. దీనివల్ల మీరు అనారోగ్యం పాలవుతారు. చాలాసార్లు ఆసుపత్రికి వెళ్లవలసి వస్తుంది. ఈ సీజన్‌లో ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. అవేంటో చూద్దాం..
ఉప్పుకు దూరం
వేసవిలో ఉప్పు తక్కువ తినండి! ఎక్కువైతే బీపీ, వాపులు, గుండె జబ్బులు వస్తాయి.హెల్త్ లైన్ ప్రకారం వేసవిలో ఉప్పు తీసుకోవడం తగ్గించండి. ఉప్పు మన ఆహారాన్ని రుచికరంగా చేస్తుంది. కానీ ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో అధిక రక్తపోటు, వాపు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
టీ, కాఫీలకు టాటా చెప్పేయండి
టీ, కాఫీ తాగేవాళ్లు వేసవిలో కూడా వాటిని వదలరు. ఒకటి రెండు కప్పుల వరకు ఓకే, కానీ కొంతమంది రోజులో చాలాసార్లు తాగుతుంటారు. టీ, కాఫీ వేడి స్వభావం కలిగి ఉంటాయి. ఇది శరీరం వేడిని పెంచుతుంది. టీ, కాఫీలకు బదులు నిమ్మరసం, మజ్జిగ తాగండి. వేడి చేస్తే జీర్ణ సమస్యలు వస్తాయి.
ఊరగాయలకు దూరంగా ఉండాలి
వేసవిలో ఊరగాయలు తినకూడదు. వీటిని తింటే శరీరంలో నీరు నిల్వ ఉండి, వాపు వస్తుంది. అంతేకాదు, అజీర్తి కూడా వస్తుంది. అల్సర్‌ను ఇది మరింత తీవ్రతరం చేస్తుంది.
spicy food
కారం తినకూడదు
వేసవిలో కారం తినకూడదు. కారంలో ఎక్కువగా ఉండే కాప్సైసిన్ శరీరంలో పిత్త దోషాన్ని పెంచుతుంది. దీనివల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. చాలా చెమట పడుతుంది, చర్మంపై దద్దుర్లు వస్తాయి.
జంక్ ఫుడ్, వేపుళ్ళు వద్దు
జంక్ ఫుడ్, వేపుళ్ళు ఆరోగ్యానికి మంచివి కావు. చలికాలంలో తినవచ్చు, కానీ వేసవిలో ఇవి మిమ్మల్ని అనారోగ్యానికి గురిచేస్తాయి. సమోసా, బర్గర్, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటివి డీహైడ్రేషన్‌కు కారణమవుతాయి. వీటిని జీర్ణం చేసుకోవడం కష్టం.
గ్రిల్డ్ మాంసం వద్దు
వేసవిలో గ్రిల్డ్ మాంసం తినకూడదు. బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. గ్రిల్డ్ మాంసం తింటే శరీర ఉష్ణోగ్రత మరింత పెరుగుతుంది. దీనివల్ల డీహైడ్రేషన్‌కు గురవుతారు.
Dark Chocolate
డార్క్ చాక్లెట్ వద్దు
వేసవిలో డార్క్ చాక్లెట్ తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా తింటే విరేచనాలు, చిరాకు, గుండెదడ వంటివి వస్తాయి. డీహైడ్రేషన్‌కు కూడా గురవుతారు.