Health Tips: అమ్మాయిలు.. పీరియడ్స్ టైం లో ఈ పొరపాట్లు చేయకండి.. ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి!
Health Tips: పీరియడ్స్ అనేవి ప్రతి మహిళ తన జీవితంలో ఫేస్ చేయవలసిన ప్రాబ్లం. అయితే దీని గురించి ఇప్పటికి చాలామందికి సరి అయిన అవగాహన లేకపోవడం గమనార్హం. పీరియడ్ టైం లో ఆడపిల్లలు చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా పీరియడ్స్ గురించి ఇప్పటికీ ఏ తల్లి బహిర్గతంగా మాట్లాడటానికి ఇష్టపడదు. కానీ అది మంచి పద్ధతి కాదు. తన కూతురికి తల్లి ప్రతి విషయాన్ని దగ్గరుండి ఈ విషయంలో చర్చించాలి. లేనిపక్షంలో ఆడపిల్లలు తెలియకుండానే చేసే కొన్ని పొరపాట్లు వారి ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంటాయి.
అవేమిటంటే కొంతమంది స్త్రీలు పీరియడ్స్ టైం లో నొప్పుల వల్ల, అలసట వల్ల స్నానం చేయడానికి ఇష్టపడరు. అలా చేయకపోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. పీరియడ్స్ వల్ల వచ్చే బ్లీడింగ్ ని శుభ్రం చేసుకోవడం చాలా అవసరం. స్నానం చేయకపోవడం వలన యోని ప్రాంతంలో మరింత చిరాకుగా ఉంటుంది.
కాబట్టి పీరియడ్స్ టైం లో రోజుకి రెండుసార్లు కుదరకపోతే కనీసం ఒకసారి అయినా తప్పనిసరిగా స్నానం చేయండి. అలాగే బ్లీడింగ్ అవుతున్నప్పుడు యోని ప్రాంతాన్ని క్లీన్ చేసుకోవడానికి నీటి కంటే ఉత్తమమైనది మరొకటి లేదు. ఒకవేళ సోపులు, క్లేంజర్లు వాడవలసి వస్తే తక్కువ స్థాయి పీహెచ్ ఉన్న వాటిని మాత్రమే ఎంచుకోవాలి.
అలాగే చాలామంది పీరియడ్ బ్లీడింగ్ చికాకుగా ఉంటుందని చెప్పి నార్మల్ శానిటరీ ప్యాడ్ కన్నా సెంటెడ్ సానిటరీ ప్యాడ్ వాడుతూ ఉంటారు. దీని వలన లాభం కంటే నష్టమే ఎక్కువ. ఎందుకంటే సెంటెడ్ సానిటరీ నాప్కిన్స్ యోని ప్రాంతంలో వచ్చే ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. ఇందులోని రసాయనాలు చికాకుని, దురదని, వాపుని కలిగిస్తాయి.
కాబట్టి నార్మల్ ప్యాడ్స్ వాడటం మంచిది. అలాగే కొంతమంది టాంపోన్ వాడతారు. యోని లోపల టాంపోన్ పెట్టుకోవడం వలన బ్లీడింగ్ ని అది శోషించుకుంటుంది. అయితే ఎక్కువ సేపు అలా ఉంచుకోవటం మంచిది కాదు అంటున్నారు వైద్యులు. అలాగే చాలామంది టాంపోన్ ఉంచుకొని రాత్రంతా నిద్రపోతూ ఉంటారు.
అయితే ప్రతి నాలుగు నుంచి ఆరు గంటలకి ఒకసారి టాంపోన్ మార్చుకోవాలి. లేదంటే యోని ప్రాంతంలో బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్యలను తల్లి మాత్రమే పిల్లలకు చెప్పి వారికి ఒక అవగాహన తీసుకురాగలదు. కాబట్టి ఈ విషయంపై తల్లులు జాగ్రత్త పడాల్సిందే.