బరువు తగ్గాలని బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే ఉదయం తినకుండా అస్సలు ఉండలేరు
బ్రేక్ ఫాస్ట్ ను మానేయడం మీకు చిన్న విషయంగా అనిపించొచ్చు. కానీ ఇది మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.
మనలో చాలా మంది ఉదయం పూట తినడమే మానేస్తుంటారు. తీరిక లేని పనులు, టైం లేకపోవడం వల్ల ఇలా చేయొచ్చు. కానీ బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. బ్రేక్ ఫాస్ట్ ను మానేయడం వల్ల మీకు రోజంతా ఆకలిగా ఉంటుంది. ముఖ్యంగా తిన్న తర్వాత కూడా మీ కడుపు నిండినట్టుగా అనిపించదు. ఇది మీరు మరింత బరువు పెరగడానికి దారితీస్తుంది.
breakfast
బరువు తగ్గడానికి చాలా మంది బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేసేస్తుంటారు. నిజమేంటంటే.. ఇలా చేస్తేనే మీకు ఆకలి కోరికలు మరింత పెరుగుతాయి. దీంతో మీరు విపరీతంగా బరువు పెరుగుతారు. అందుకే తినే సమయాలను స్కిప్ చేయొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు బ్రేక్ ఫాస్ట్ ను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
breakfast
ఆకలి కోరికలను నియంత్రించడంలో..
ఉదయం ఖాళీ కడుపుతో ఉండి అల్పాహారం తీసుకోని వారికి సాయంత్రం, రాత్రి పూట ఫుడ్ పై వ్యామోహం పెరుగుతుంది. ఇలాంటి సమయంలో మీరు పిజ్జా, పాస్తాతో పాటుగా అనారోగ్యకరమైన ఆహారాన్ని తినే అవకాశం ఉంది. వీటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వాటిని తినడం వల్ల మీరు సులువుగా మరింత బరువు పెరుగుతారు. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అదే ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను చేస్తే అనవసరమైన ఆహార కోరికలూ ఉండవు. బరువు పెరిగే అవకాశం కూడా ఉండదు.
breakfast
కేలరీల సమతుల్యం
చాలా మంది బరువు తగ్గడానికని బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తుంటారు. దీనివల్ల మీరు సాయంత్రం, రాత్రి విపరీతంగా తినే అవకాశం ఉంది. ఇదిమీరు బరువు పెరగడానికి దారితీస్తుంది. అదే మీరు ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారంతో రోజును ప్రారంభించినప్పుడు మీరు బరువు పెరిగే అవకాశమే ఉండదు. ఇలాగే ఇది మీమ్మల్ని రోజంతా చురుగ్గా ఉంచుతుంది. అలాగే మీరు అవసరాన్ని బట్టే తింటారు. తద్వారా కేలరీలను పరిమితం చేస్తారు. అందుకే బరువు తగ్గడంలో ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను..
ఉదయం అల్పాహారం మీ శక్తి స్థాయిలు, మీ ఏకాగ్రతను పెంచడానికి గ్లూకోజ్ లేదా రక్తంలో చక్కెర సరఫరాను తిరిగి నింపుతుంది. రోజంతా గ్లూకోజ్ హెచ్చుతగ్గులను నివారించడానికి ఉదయం లేచిన రెండు గంటల్లో పండ్లు, ధాన్యాలు, సన్నని ప్రోటీన్ ను తినండి. బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేసేవారితో పోలిస్తే క్రమం తప్పకుండా అల్పాహారం తినేవారికి డయాబెటిస్ వచ్చే ప్రమాదం చాలా తక్కువ.
breakfast
జీవక్రియను పెంచుతుంది
మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ మీ జీవక్రియను పెంచుతుంది. ముఖ్యంగా బరువు తగ్గించే డైట్ లో ఉన్నవారికి ఇది మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. చురుకైన, ఆరోగ్యకరమైన జీవక్రియ ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేయడం వల్ల మీ శరీర జీవక్రియ కేలరీలను బర్న్ చేయడానికి బదులుగా పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తుంది.
శక్తిని పెంచడానికి
ఉదయం అల్పాహారం శరీరానికి తగినంత శక్తిని అందిస్తుంది. అల్పాహారం తినేవారికి అల్పాహారం స్కిప్ చేసేవారి కంటే చురుకైన శరీరం ఉంటుంది. అలాగే శారీరక శ్రమను మరింత సమర్థవంతంగా చేయగలుగుతారు. అదే శారీరక కార్యకలాపాలు బరువు పెరగడం, అలసటను నివారించడానికి సహాయపడతాయి.