MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Health
  • రుతువిరతి తర్వాత ఆడవారి శరీరంలో ఈ మార్పులొస్తాయి

రుతువిరతి తర్వాత ఆడవారి శరీరంలో ఈ మార్పులొస్తాయి

రుతువిరతి చర్మ ఆరోగ్యాన్ని బాగా ప్రభావితం చేస్తుంది. ఈ దశలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం వల్ల చర్మం  స్థితిస్థాపకత, తేమను నిలుపుకునే సామర్థ్యం తగ్గుతుంది. దీనివల్ల చర్మం పొడిబారుతుంది. అలాగే ముడతలు వస్తాయి. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 19 2023, 02:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

రుతువిరతి అనేది స్త్రీ జీవితంలో ఒక సహజమైన దశ. ఇది సాధారణంగా 45 నుంచి 55 సంవత్సరాల మధ్య వస్తుంది. రుతువిరతి అంటే రుతుక్రమం ఆగిపోవడం. రుతుక్రమం ఆగిపోయిన మహిళలకు సంతానోత్పత్తి ఉండదు. కాగా కౌమారదశలో ఉన్న మహిళలకు ప్రతి నెలా ఒక ఎగ్ ఉత్పత్తి అవుతుంది. ఇది సంతానోత్పత్తి సహాయపడుతుంది. గర్భం దాల్చకపోతే ఇది పీరియడ్ బ్లడ్ ద్వారా బయటకు పోతుంది. అందుకే  స్త్రీలు మధ్య వయస్సు వచ్చే వరకు అండోత్సర్గము చేస్తూనే ఉంటారు. వయసు పెరిగేకొద్ది ఇది ఆగిపోతుంది. దాంతో రుతుస్రావం అవసరం ఉండదు. మెనోపాజ్ సమయంలో మహిళల్లో ఎన్నో శారీరక, మానసిక మార్పులు వస్తాయి. అవేంటంటే.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

చర్మ ఆరోగ్యం

రుతువిరతి తరచుగా చర్మం యొక్క ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.  ఈ దశలో శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడంతో చర్మం స్థితిస్థాపకత, తేమను నిలుపుకునే సామర్థ్యం తగ్గుతుంది. దీనివల్ల చర్మం పొడిబారుతుంది. ముడతలు ఏర్పడతాయి. అలాగే ఎన్నో చర్మ సమస్యలు వస్తాయి. 
 

37
menopause

menopause

కొలెస్ట్రాల్

రుతువిరతి కొలెస్ట్రాల్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం,  సమతుల్య ఆహారంతో సహా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అలాగే ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. అలాగే హృదయనాళ వ్యాధుల ప్రమాదాలను తగ్గించడానికి సహాయపడుతుంది.
 

47

నిద్ర

రుతువిరతి సమయంలో హార్మోన్ల స్థాయిల్లో మార్పులొస్తాయి. ఇది నిద్ర విధానాలకు ఆటంకం కలిగిస్తుంది. అలాగే ఇది రాత్రిపూట చెమట ఎక్కువ పట్టడానికి కూడా కారణమవుతుంది.
 

57

బోలు ఎముకల వ్యాధి

రుతువిరతి తర్వాత బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువ. ఎముక సాంద్రతను నిర్వహించడంలో ఈస్ట్రోజెన్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే రుతువిరతి తర్వాత ఈస్ట్రోజెన్ తగ్గుతుంది. ఈ లోపం బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. దీనివల్ల ఎముకల బలహీనపడతాయి. ఎముకల ఆరోగ్యం మెరుగ్గా ఉండటానికి, పగుళ్ల ప్రమాదాన్ని తగ్గించడానికి అవసరమైన కాల్షియం, విటమిన్ డి ని తీసుకోండి. 
 

67
Image: Getty

Image: Getty

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు

ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం వల్ల యోని, మూత్రాశయం కణజాలాలు ప్రభావితం అవుతాయి. ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది.
 

77

మానసిక ఆరోగ్యం

రుతువిరతితో సంబంధం ఉన్న హార్మోన్ల మార్పులు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. చాలా మంది మహిళలు ఈ దశలో మానసిక స్థితి, చిరాకు, ఆందోళన, నిరాశకు గురవుతారని నిపుణులు చెబుతున్నారు. జీవనశైలి మార్పులు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మానసిక ఆరోగ్యం బాగుంటుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?
Recommended image2
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image3
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved