బాదం పప్పులను నానబెట్టే ఎందుకు తినాలంటే?
నానబెట్టిన బాదం పప్పులను రోజూ తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిలో ఉండే విటమిన్ ఇ మన జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే..
బాదం పప్పులను రాత్రంతా నానబెట్టి ఉదయం తినాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు తరచుగా చెప్తుంటారు. అయితే ఇలా నానబెట్టే ప్రక్రియలో సంభవించే మార్పుల వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. రాత్రంతా బాదం పప్పులను నీటిలో నానబెట్టినప్పుడు.. రసాయన మార్పులకు లోనవుతాయి. అలాగే వీటి పోషక విలువ కూడా పెరుగుతుంది. అంతేకాదు ఇవి చాలా సులభంగా జీర్ణమవుతాయి. నానబెట్టిన బాదం పప్పులను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Soaked Almonds
మెరుగైన జీర్ణక్రియ
బాదంలో ఎంజైమ్ ఇన్హిబిటర్స్, టానిన్లు ఉంటాయి. ఇవి బాదంలను జీర్ణించుకోవడం కష్టతరం చేస్తాయి. అయతే బాదం పప్పులను నానబెట్టడం వల్ల వాటి ఆకృతి మృదువుగా అవుతుంది. అలాగే ఈ నిరోధకాలను విచ్ఛిన్నం చేస్తుంది. అంటే వీటిని జీర్ణం చేసుకోవడం సులువు అవుతుంది. అలాగే పోషక శోషణ కూడా మెరుగుపడుతుంది.
మెరుగైన పోషక శోషణ
నానబెట్టే ప్రక్రియ వల్ల బాదం మొలకెత్తే ప్రక్రియ మొదలవుతుంది. ఇది దానిలోని పోషకాలను పెంచుతుంది. నానబెట్టిన బాదంలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి కొన్ని పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిని శరీరం సులువుగా గ్రహిస్తుంది.
ఎంజైమ్ యాక్టివేషన్
బాదం పప్పులను నానబెట్టడం వల్ల గింజల్లో ఉండే ఎంజైమ్స్ యాక్టివేట్ అవుతాయి. ఈ ఎంజైమ్లు పోషకాలను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడతాయి. ఈ ఎంజైమ్ చర్య పోషక శోషణకు ఆటంకం కలిగించే యాంటీన్యూట్రియెంట్లను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
soaked badam
ఫైటిక్ యాసిడ్ రిడక్షన్
బాదంలో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఖనిజాల శోషణను నిరోధిస్తుంది. అయితే బాదం పప్పులను నానబెట్టడం వల్ల ఫైటిక్ యాసిడ్ కంటెంట్ తగ్గుతుంది. దీంతో కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాల శోషణ పెరుగుతుంది.
soaked badam
నమలడం సులభం
నానబెట్టిన బాదం పప్పులు మృదువుగా ఉంటాయి. అలాగే వీటిని నమలడం సులభం అవుతుంది. ముఖ్యంగా దంత సమస్యలు ఉన్నవారికి లేదా పిల్లలకు. దీంతో వీళ్లు బాదం పోషకాలను సులువుగా పొందుతారు.
బరువు నిర్వహణ
బాదంలోని ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు సంతృప్తిని ప్రోత్సహిస్తాయి. అలాగే ఆకలిని నియంత్రించడానికి సహాయపడతాయి. నానబెట్టిన బాదం బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. ఇది మన కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. అలాగే అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది.
గుండె ఆరోగ్యం
బాదంలో మోనోశాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. నానబెట్టిన బాదం కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
గర్భధారణ సమయంలో గింజలు తినాలని చాలా మంది వైద్యులు సిఫార్సు చేస్తుంటారు. నానబెట్టిన బాదం పప్పులను రోజుకు ఒకసారి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నానబెట్టిన బాదం తినడం వల్ల బిడ్డలో గుండె లోపాలు, న్యూరల్ ట్యూబ్స్ వంటి ప్రమాదాలు తగ్గుతాయి. అలాగే మీ బిడ్డ ఆరోగ్యంగా జన్మించడానికి సహాయపడుతుంది. ఇది జ్ఞాపకశక్తి, మొత్తం అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుంది.